కథనం టీజర్ రిలీజ్

Kathanam Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kathanam Telugu Movie Teaser,Kathanam Teaser,#KathanamTeaser,Kathanam Movie Official Teaser,Kathanam Movie Latest Updates,Kathanam Telugu Movie Latest News,Anasuya New Movie Kathanam Teaser
Kathanam Movie Teaser Out Now

క్ష‌ణం సినిమాతో సీరియ‌స్ న‌టిగా గుర్తింపు తెచ్చుకొని… ఆ త‌ర్వాత రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయింది అనసూయ. మంచి పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకొని ఇప్పుడు ప్రధాన పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు క‌థ‌నం సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తుంది.

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో కథనం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా… గతకొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ను చూస్తుంటే అనసూయ మరోసారి డిఫరెంట్ స్టోరీతో రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇంకా ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యూసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here