`చిత్ర‌ల‌హ‌రి` కోసం డ‌బ్బింగ్ చెప్పుకోనున్న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

Kalyani Priyadarshan to Dub her own voice in Chitralahari Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Kalyani Priyadarshan New Movie News,Kalyani Priyadarshan own voice in Chitralahari Movie,Kalyani Priyadarshan To Dub Her Own Self in Chitralahari Movie,Chitralahari Movie Latest News
Kalyani Priyadarshan to Dub her own voice in Chitralahari Movie

`హ‌లో` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి మార్కులు తెచ్చుకున్న క‌ళ్యాణి… ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. రెండు తెలుగు చిత్రాలు, రెండు త‌మిళ చిత్రాలు, ఒక మ‌ల‌యాళ చిత్రం… ఇలా మొత్తం ఐదు సినిమాలతో క‌ళ్యాణి బిజీగా ఉందిప్పుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… వీటిలో ముందుగా తెర‌పైకి రానున్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో క‌ళ్యాణి అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అంతేకాదు… త‌న పాత్ర‌కే త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటోంద‌ని టాలీవుడ్ టాక్‌. మొత్తానికి రెండో సినిమాతోనే తెలుగు ప‌లుకులు వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్న క‌ళ్యాణి… మున్ముందు కూడా ఇదే తీరున కొన‌సాగుతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే… `చిత్ర‌ల‌హ‌రి` వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 12న తెర‌పైకి రానుంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

[subscribe]

[youtube_video videoid=03Mk3HEzRdM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =