పాపులర్ దర్శకుడు శివ దర్శకత్వం అజిత్, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా విశ్వాసం. తమిళ్ లో ఈసినిమా పొంగల్ బరిలో దిగి మంచి హిట్టయింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాను ఈరోజు రిలీజ్ చేశారు. మరి తమిళ తంబీలకు బాగా నచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో.. ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : అజిత్ కుమార్, నయనతార, జగపతిబాబు తదితరులు
దర్శకత్వం : శివ, ఆదినారాయణ
నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్
తెలుగు నిర్మాత: ఆర్.నాగేశ్వరరావు
సంగీతం : డి.ఇమ్మాన్
సినిమాటోగ్రఫర్ : వెట్రి
కథ :
వీర్రాజు (అజిత్) తన ఊరైన రావుల పాలెం మరియు అలాగే చుట్టూ పక్కల గ్రామాలకు పెద్ద దిక్కులాగా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ ముందుండి వారికి తోడుగా ఉంటాడు. వీర్రాజు ఏది చెప్పే అదే వేదం అక్కడి వాళ్లకు. వాళ్లు నమ్ముకున్నట్టే తమ వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ గ్రామాలన్నీ కలిసి పదేళ్లకు ఒకసారి జాతర జరుపుకుంటుంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ జాతర జరపకూడదని కొంతమంది పట్టు బడతారు. వీర్రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాతర జరగాల్సిందే అని జాతరను ఘనంగా జరిపిస్తాడు. ఈ నేపథ్యంలో అక్కడ అందరూ సంతోషంగా గడుపుతుండగా.. వీర్రాజు మాత్రం భార్య (నయనతార) దూరమై ఒక్కడే బాధ పడుతుంటుంటాడు. దీంతో వీర్రాజు బాధ చూసిన బంధువులు ముంబైలో ఉంటున్న భార్యను ఒప్పించి మళ్లీ తీసుకురమ్మంటారు. అలా భార్య, కూతురు కోసం వెళ్లిన వీర్రాజుకు తన కూతురిని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తుంటారని తెలుసుకుంటాడు. ఇంతకీ వీర్రాజు కూతుర్ని చంపడానికి ప్రయత్నించేది ఎవరు? వారికి తన కూతురికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు వీర్రాజు కూతుర్ని చంపాలనుకుంటారు..? వీర్రాజును అతని భార్య ఎందుకు వదిలేసింది ? చివరికి వీర్రాజు, అతని భార్య కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా. అంతకు ముందు అజిత్‌తో వీరం, వేదాలం, వివేగం చిత్రాలను తెరకెక్కించిన శివ మరోసారి అజిత్ తో మంచి మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. నిజానికి ఈ స్టోరీ లైన్ పాతదే. మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లోనే చూసి ఉంటాం. అయితే దర్శకుడు ప్రేక్షకులకు కథ విషయంలో కొత్తదనం చూపించడం కన్నా… తాను ఎంచుకున్న రోటీన్ కథకే మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సగటు ప్రేక్షకుడి హృదయాన్ని టచ్ చేసే ఎమోషన్స్ ను జోడించి ఎంటర్టైన్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
ఇక వీర్రాజు పాత్రలో అజిత్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. పల్లెటూరి గెటప్ లో తన బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. అలాగే నయనతారతో సాగే సీన్స్ .. అలాగే అజిత్ కూతురికి, అజిత్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగానే అలరిస్తాయి. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆయన సినిమాకి హైలెట్ గా నిలచారు.
ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార.. ఎప్పటిలాగే తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. కూతురు పాత్రలో బేబీ అంకిత క్యూట్‌గా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన జగపతిబాబు కూడా తన గంభీరమైన నటనతో మెప్పిస్తారు. తన నటనతో సినిమాలో సీరియస్ నెస్ తెచ్చారు. అయితే జగపతి బాబు పాత్ర ఇంకా పవర్ ఫుల్‌గా డిజైన్ చేసి ఉండొచ్చనిపిస్తుంది.
ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. వెట్రీ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరి పచ్చదాన్ని సూపర్భ్‌గా తన కెమెరాలో ఫోకస్ చేశాడు. డి ఇమ్మాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. రుబెన్ ఎడిటింగ్ ఫర్వాలేదు. దర్శకుడి శివ అందించిన స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఇతర టెక్నికల్ విభాగాల పనీ తీరు ఫర్వాలేదు.
ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. క్లాస్ ఆడియన్స్ కు సినిమా ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేం.
విశ్వాసం తెలుగు మూవీ రివ్యూ
-
2.5/10
-
2.5/10
-
2.5/10
-
2.5/10
User Review
( votes)[youtube_video videoid=TPht8lHyE0g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: