21 రిలీజ్ లలో ఒక్కటంటే ఒక్క హిట్టూ లేని డిజాస్టర్ మంత్ ఫిబ్రవరి

Complete Box Office Report of Telugu Movies in this February,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,February Tollywood Movies Box Office Report,Overview of Telugu Movies Collections in February 2019,2019 February Telugu Movies Box Office Collections Report,Tollywood Films Collections in February 2019
Complete Box Office Report of Telugu Movies in this February

2019లో రెండవ నెల ఫిబ్రవరి రేపటితో పూర్తవుతుంది. సినిమాల ఫలితాల పరంగా మాసాంత సమీక్ష చూసుకుంటే గుండెలు గుభేల్మంటాయి… ఎంత బ్యాడ్ సీజన్ అయినప్పటికీ ప్రతి నెలలో ఒకటో రెండో హిట్స్ ఉంటాయి. కానీ 2019 ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలను వాటి ఫలితాలను ఒకసారి సమీక్షించుకుని చూస్తే “సినిమాలు తీయడం అవసరమా”
అన్నంత దారుణంగా ఉన్నాయి ఫలితాలు.
ఈ నెలలో 15 స్ట్రెయిట్ చిత్రాలు , 6 డబ్బింగ్ చిత్రాలు కలుపుకుని మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఒకసారి ఆ జాబితా ఏమిటో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1-2-2019

మూవీ – బిచ్చగాడా మజాగా
నిర్మాత – బి. చంద్రశేఖర్
బ్యానర్ – ఆల్ వెరైటీ మూవీ మేకర్స్
డైరెక్టర్- కె.ఎస్ నాగేశ్వర్రావు
మ్యూజిక్ – శ్రీ వెంకట్
నటీనటులు – అర్జున్ రెడ్డి, నేహా దిషాపాండే

01.02.2019
మూవీ – సకల కళా వల్లభుడు
నిర్మాత – జి. అనిల్ కుమార్
బ్యానర్ – సింహా ఫిలింస్
డైరెక్టర్ – శివ గణేష్
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్
నటీనటులు – తనిష్క్ రెడ్డి, మేఘ్లా ముక్త, అలెక్సా

01.02.2019
మూవీ – గేమర్
నిర్మాత – తడకల రాజేష్
బ్యానర్ – బీ.జీ వెంచర్స్
డైరెక్టర్ – టీ.రాజేష్
మ్యూజిక్ – ప్రజ్వల క్రిష్
నటీనటులు – చిత్రంశ్రీను, అనిరుథ్, స్రనిత్ రాజ్, కళ్యాణి పటేల్, నేహా

01.02.2019
మూవీ – అక్కడొకడుంటాడు
నిర్మాత – కె. శివశంకర్ రావు, రావుల వెంకటేశ్వరరావు
బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్
డైరెక్టర్ – శ్రీపాద విశ్వక్
మ్యూజిక్ – సాక్స్
నటీ నటులు – శివ కంఠమనేని, రామ్ కార్తిక్, శివ హరీష్, రసగ్న దీపిక, అలేక్య

01.02.2019
మూవీ – రహస్యం
నిర్మాత – టీ. ఆంజనేయ గుప్త, టీ.రామ సత్యనారాయణ
బ్యానర్ – భీమవరం టాకీస్
డైరెక్టర్ – సాగర్ శైలేష్
మ్యూజిక్ – కబీర్ రఫీ
నటీనటులు – సాగర్ శైలేష్, శ్రీ రితిక

08.02.2019
మూవీ – నేనే ముఖ్యమంత్రి
నిర్మాత – అలూరి సాంబశివరావు
బ్యానర్ – అలూరి క్రియేషన్స్
డైరెక్టర్ – మోహన్ రావిపాటి
మ్యూజిక్ – ఫణి కళ్యాణ్
నటీనటులు – దేవి ప్రసాద్, సుచిత్ర

08.02.2019
మూవీ – అమావాస్య
నిర్మాత – సచిన్ జె జోషి
బ్యానర్ – వికింగ్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
డైరెక్టర్ – భూషణ్ పటేల్
మ్యూజిక్ – అసద్ ఖాన్
నటీ నటులు – సచిన్ జె జోషి, వివన్ భటేనా, నర్గీస్ ఫక్రీ, మోనా సింగ్

08.02.2019
మూవీ- యాత్ర
నిర్మాత – డీ. శశిధర్ రెడ్డి, సీ.జీ.పీ విజయ్ కుమార్ రెడ్డి
బ్యానర్ – 70 ఎమ్ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్
డైరెక్టర్ – మహి. వి రాఘవ్
మ్యూజిక్ – కె ( కృష్ణ కుమార్)
నటీనటులు – మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, అనసూయ

08.02.2019
మూవీ – ఎమ్6
నిర్మాత – ఎస్.సురేష్
బ్యానర్ – శ్రీ లక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్
డైరెక్టర్ – ఆర్.రఘురాజ్
మ్యూజిక్ – విజయ్ బాలతి
నటీనటులు – ధృవ, శ్రావణి, అశ్విని

08.02.2019
మూవీ – ఉన్మాది
నిర్మాత – నందమ్ రామారావు
బ్యానర్ – ప్రవీణ్ క్రియేషన్స్
డైరెక్టర్ – ఎన్.ఆర్ రెడ్డి
మ్యూజిక్ – డేవిడ్
నటీనటులు – ఎన్.ఆర్ రెడ్డి, శిరిష

22.02.2019
మూవీ – ఎన్టీఆర్ మహానాయకుడు
నిర్మాత – నందమూరి బాలకృష్ణ
బ్యానర్ – ఎన్బీకే ఫిలింస్ ఎల్ఎల్పీ
డైరెక్టర్ – జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)
మ్యూజిక్ – కీరవాణి
నటీనటులు – బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, విద్యాాబాలన్, రానా దగ్గుబాటి

22.02.2019
మూవీ – మిఠాయి
నిర్మాత – ప్రశాంత్ కుమార్
బ్యానర్ – రెడ్ ఆంట్స్ సినిమా
డైరెక్టర్ – ప్రశాంత్ కుమార్
మ్యూజిక్ – వివేక్ సాగర్
నటీనటులు – ప్రశాంత్ కుమార్, వివేక్ సాగర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేత వర్మ, అర్ష

22.02.2019
మూవీ – 4 లెటర్స్
నిర్మాత – డీ. ఉదయ కుమార్
బ్యానర్ – ఓం శ్రీ చక్ర క్రియేషన్స్
డైరెక్టర్ – ఆర్. రఘురాజ్
మ్యూజిక్ – భీమ్స్
నటీనటులు – ఈశ్వర్, తుయా చక్రబోర్తి, అంకిత మహారాణా

22.02.2019
మూవీ – ప్రేమెంత పనిచేసే నారాయణ
నిర్మాత – జొన్నలగడ్డ శ్రీనివాస రావు
బ్యానర్ – జేఎస్ఆర్ మూవీస్
డైరెక్టర్ – జే.ఎస్ రావు
మ్యూజిక్ – యజమాన్య
నటీనటులు – జే.హరికృష్ణ, అక్షిత

22.02.2019
మూవీ – యాక్సిడెంట్
నిర్మాత – ఎస్. జ్ఞానేశ్వరరావు
బ్యానర్ – శ్రీ జయ లక్ష్మీ ఆర్ట్స్
డైరెక్టర్ – ఎన్.వెంకట్ రెడ్డి
మ్యూజిక్ – విజయ్ బాలాజీ
నటీనటులు- సుధాకర్, నేహా

డబ్బింగ్ చిత్రాలు :
1. సీమ రాజా (08.02.2019)
2. విచారణ (08.02.2019)
3. లవర్స్ డే (14.02.2019)
4. దేవ్ (14.02.2019)
5. అంజలి సిబిఐ (22.02.2019)

ఇవీ 2019 – ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాలు. సంఖ్యాపరంగా ఘనమైన ఫిగర్ కనిపిస్తున్నప్పటికీ రిజల్ట్స్ పరంగా చిత్ర పరిశ్రమ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి ఫిబ్రవరి ఫలితాలు.

ఈ 15 స్ట్రైట్ చిత్రాలలో యాత్ర, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు మాత్రమే వెల్ నోటీస్డ్ ఫిలిమ్స్ గా పబ్లిక్ అండ్ మీడియా దృష్టిని ఆకర్షించగలిగాయి. మిగిలిన 13 సినిమాలలో కొన్ని పబ్లిసిటీ పరంగా కొంత హడావుడి చేసినప్పటికీ ఆ మాత్రం రిటర్న్స్ కూడా ఇవ్వకుండా ఆయా నిర్మాతలను నిలువు దోపిడీ చేశాయి.
ఇక జనం దృష్టిని ఆకర్షించి అంచనాల అందలాల మీద వచ్చిన
యాత్ర, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు కూడా రెవిన్యూ పరంగా తీవ్ర నిరాశను కలిగించాయి. పెట్టిన పెట్టుబడి దృష్ట్యా, చేసిన పబ్లిసిటీ దృష్ట్యా ‘యాత్ర’అయినా కొంతమేరకు పర్వాలేదనిపించుకుందిగాని, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మాత్రం మహా దారుణమైన ఫలితంతో ఫిల్మ్ ట్రేడ్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత సంవత్సరం వచ్చిన ‘మహానటి’ బయోపిక్స్ మీద గొప్ప హోప్స్ క్రియేట్ చేయగా ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ సిరీస్ అండ్ యాత్ర చిత్రాలు మాత్రం బయోపిక్స్ పట్ల భయోత్పాతాన్ని క్రియేట్ చేశాయి.
కలెక్షన్ల ఫిగర్స్ కూడా ఇచ్చి ఆ దారుణ ఫలితాలను మరలా గుర్తు చేసుకోవడం ఎందుకుగానీ మొత్తమ్మీద 2019 చిత్ర పరిశ్రమకు చుక్కలు చూపించేలా ఉంది.

గత సంవత్సరం ఈ సమయానికి 4 విజయాలతో, కొన్ని యావరేజ్ లతో చాలా హోప్ ఫుల్ గా అనిపించింది.
గత సంవత్సరం జనవరిలో జై సింహ, భాగమతి , ఫిబ్రవరిలో చలో, తొలిప్రేమ చిత్రాల విజయంతో పరిశ్రమ ఆశాజనకంగా అనిపించింది. కానీ ఈ సంవత్సరం డబ్బింగ్ చిత్రాలతో కలుపుకొని జనవరిలో 16, ఫిబ్రవరిలో 21 చిత్రాలు విడుదల కాగా “ఎఫ్ – 2 ఒక్కటి మాత్రమే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఈ రెండు నెలల్లో కలిపి మొత్తమ్మీద 37 చిత్రాలు విడుదల కాగా 36 చిత్రాలు ప్లాపులుగా మిగిలిపోయాయి.

నిజానికి ఇది చాలా దారుణమైన పరిస్థితి. సినిమాలు అన్న తర్వాత జయాపజయాలు సహజమేగానీ మరీ ఇంత దారుణ ఫలితాలు రావటం బాధాకరం. అయితే ఎన్ని ఫ్లాపులు వచ్చినా, ఎంత నష్టపోయినా సినిమాల నిర్మాణ సంఖ్య తగ్గకపోగా ఏ ఏటికాయేడు పెరుగుతూ పోవటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.

కొద్దిపాటి హెచ్చుతగ్గులతో 2011 నుండీ 2018 వరకు సినిమాల నిర్మాణ సంఖ్య ఎలా ఉందో చూద్దాం.

సంవత్సరం – స్ట్రెయిట్ – డబ్బింగ్

2011 – 120 – 123
2012 – 127 – 97
2013 – 178 – 92
2014 – 194 – 82
2015 – 172 – 73
2016 – 181 – 85
2017 – 177 – 68
2018 – 171 – 57

ఇలా సంవత్సరాలవారీగా చూసుకుంటే డబ్బింగ్ చిత్రాల సంఖ్య తగ్గి స్ట్రైట్ చిత్రాల సంఖ్య పెరగటం ఆనందదాయకమే కానీ పెరుగుతున్న నిర్మాణాల సంఖ్యతో పోల్చితే సక్సెస్ ల సంఖ్య మాత్రం చాలా నిరాశాజనకంగా ఉంది. మొదటి రెండు నెలల్లో ఇంత దారుణమైన ఫలితాలను ఇచ్చిన 2019 మిగిలిన పది నెలల్లో
ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=fdc0DiFHMzM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =