కోడి రామకృష్ణ గురించి తెలియని కొన్ని నిజాలు

Unknown Facts About Legendary Director Kodi Ramakrishna,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Unknown Facts About Kodi Ramakrishna,Director Kodi Ramakrishna Latest News,Tollywood Director Kodi Ramakrishna Cinema Life Story,Some Interesting Facts About Kodi Ramakrishna
Unknown Facts About Legendary Director Kodi Ramakrishna

కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్, హార్రర్, పొలిటికల్, డివోషనల్, గ్రాఫిక్స్ ఇలా అన్ని జోనర్లలో సినిమాలు తీసిన ద వర్సటైల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కోడి రామకృష్ణ అని ముక్త కంఠంతో చెప్పొచ్చు. 1982 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఎంతో మందిని టాప్ హీరోలుగా తీర్చిదిద్దారు. దాదాపు వందకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత. అలాంటి కోడి రామకృష్ణ జీవితంలో ఎన్నో మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.. వాటిలో మచ్చుకు కొన్ని..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్లైట్ ఫోబియా

ఇదేం ఫోబియా వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉందేంటబ్బా అనుకుంటున్నారా? కరెక్టే కోడి రామకృష్ణకి ఫ్లైట్ ఫోబియా ఉండేదట. అంటే ఆయనకు విమానాలు ఎక్కాలంటే చాలా భయంగా ఉండేదట. అయితే దీనికి ఆయనకు జరిగిన ఓ సంఘటనే కారణం. అది నవంబర్ 15, 1993.. ఓసారి కోడి రామకృష్ణ ఆయతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి తిరుపతి వస్తున్న సందర్భంలో క్రాష్ అయింది. అయితే అప్పుడు వారికి ఎలాంటి ప్రమాదం, గాయాలు కాలేదు కానీ.. ఆ ఇన్సిడెంట్ తో మాత్రం కోడి రామకృష్ణ భయపడిపోయారట. అంతే అప్పటి నుండి ఎంత దూరమైనా ట్రైన్ కానీ… కారు లో కానీ మాత్రమే వెళ్లేవారట.ఫ్లైట్ మాత్రం ఇప్పటివరకూ ఎక్కలేదట.

లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావుతో ఉన్న అనుబంధం

దివంగత దర్శకరత్న దాసరితో కోడి రామకృష్ణకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. అంతేకాదు వీరిద్దరికి కూడా చాలా విషయాల్లో సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ ప్రతాప్ ఆర్ట్ బ్యానర్ లో కె. రాఘవ్ గారి దగ్గర పనిచేశారు. అంతేకాదు ఇద్దరిదీ పాలకొల్లే… ఇద్దరి సతీమణుల పేర్లు పద్మనే..ఇద్దరూ థియేటర్ ఆర్టిస్టులు..నటులు, దర్శక, నిర్మాతలు.

రిచ్ఛెస్ట్ డైరెక్టర్

ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నా కోడి రామకృష్ణ మాత్రం వన్ ఆఫ్ ద రిచ్ఛెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద టాలీవుడ్. అయినా కూడా తను చాలా సింపుల్ గా జీవించేవారు.

హెడ్ బ్యాండ్

కోడి రామకృష్ణ అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఆయనకు తలకు కట్టుకునే బ్యాండ్. ఆయనను తలుచుకుంటే మొదట గుర్తొచ్చేది అదే. అయితే మీరు ఎందుకు తలకు అలా కట్టుకుంటారని ఆయనను అడిగినప్పుడు.. ఏదైనా పని చేసేప్పుడు అందరూ నడుం బిగిస్తారు.. కానీ నేను నా తలకు బిగిస్తాను.. నా బుర్రకి పదునుపెడతాను అంటూ చమత్కరించేవారు.

గ్రాఫిక్స్ బ్రహ్మ

ఓ మూసగా వెళుతున్న ధోరణిలోకి గ్రాఫిక్స్ అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. అమ్మోరు సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ కి హై టెక్నాలిజీ విజువల్ వండర్ ని చూపించిన మొదటి దర్శకుడు. ఆతరువాత దేవుళ్ళు, దేవి అంజి, అరుంధతి వంటి డిఫరెంట్ సినిమాల్లో గ్రాఫిక్స్ కు పెద్ద పీటనే వేస్తూనే థ్రిల్లర్ ఫీలింగ్ ను కలిగించే వారు.

మ్యానరిజం

ప్రతి ఒక్కళ్లకి ఒక్కో పదం ఊత పదంగా ఉంటుంది. అలా కోడి రామకృష్ణ కూడా ఓ పదం వాడేవారు. అదే చంపేద్దాం. ఎవరైనా దేని గురించైనా అడిగినా.. చెప్పినా.. చంపేద్దాం అనే మాట ఎక్కువగా వాడేవారట.

రఘుపతి వెంకయ్య అవార్డు

తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న కోడి రామకృష్ణకి అత్యంత అరుదైన రఘపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది. తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవ చేసిన వారికి మాత్రమే దక్కే అరుదైన పురస్కారం ఇది.

అక్కినేని అభిమాని

ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఎంతో మంది హీరోలకు మంచి మంచి హిట్లందించిన కోడి రామకృష్ణ అక్కినేని నాగేశ్వర్రావుకి పెద్ద అభిమాని.

నిర్మాతల డైరెక్టర్

కోడి రామకృష్ణని నిర్మాతల డైరెక్టర్ అని అంటారు. అంటే అటు నిర్మాతలకు కష్టం కలిగించకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకొని.. మళ్లీ క్వాలిటీలో ఎలాంటి తేడా రాకుండా తీయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్. దీనికి ఉదాహరణగా ఒక సంఘటన కూడా గుర్తుచేసుకోవచ్చు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండట. ఆ సినిమాలో ఓ కోటీశ్వరుడి బర్త్ డే పార్టీ జరగాలి. అంతా రెడీగా ఉంది. ఒకపక్క జూనియర్ ఆర్టిస్టులు కావాలి.. అయితే ఆ సమయానికే నిర్మాత లేకుండా పోయాడు. దీంతో కోడి రామకృష్ణ చాలా స్పోంటేనియస్ గా ఆ ఆర్టిస్ట్ తో ఓ డైలాగ్ చెప్పించారట. ఆ డైలాగ్ ఏంటంటే.. మీరు కోటిశ్వరుడు కదా ఇంత సింపుల్ గా బర్త్ డే ఎందుకు జరుపుకుంటున్నారని ఓ వ్యక్తి అడిగితే.. దానికి ఆ ఆర్టిస్ట్.. నాకు ఆడంబరాలు ఇష్టముండదు.. ఇలానే సింపుల్ గా ఉంటాను అంటూ సమాధానం చెబుతాడు. అలా ఆ ఒక్క డైలాగ్ తో అటు నిర్మాతకు డబ్బులు మిగల్చడంతో పాటు… ఇటు మెసేజ్ కు మెసేజ్ కూడా ఇచ్చారు. అది ఆయన టాలెంట్.

దైవభక్తి

కోడి రామకృష్ణకి కాస్త దైవ భక్తి ఎక్కువనే చెప్పొచ్చు. అందుకే ఆయన చేతికి ఎన్నో రక్షలు, మెడలో రుద్రాక్షలు వేసుకుంటారు. కాస్త మూడనమ్మకాలు కూడా ఎక్కువే. అందుకే అమ్మోరు, దేవి, దేవుళ్లు లాంటి సినిమాలు తీయగలిగారేమే అనిపిస్తుంటుంది ఆయనను చూస్తుంటే.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కోడిరామకృష్ణలో ఉన్నాయి. అలాంటి లెజెండ్ డైరెక్టర్ తెలుగు కళామతల్లికి వీడ్కోలు పలికి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినా..ఆయన అందించిన సినిమాలను మాత్రం ఎవరు మర్చిపోలేరు. కోడి రామ కృష్ణ మరణించినప్పటికీ ఆయన సినిమాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయి.

[subscribe]

[youtube_video videoid=9Q_l8Ul-raA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 5 =