షూటింగ్ పూర్తి చేసుకున్న మజిలీ

2019 Latest Telugu Movies News, Majili Movie Completes Shooting, Majili Movie Latest News, Majili Telugu Movie Shooting Wraps up the Shooting, Majili Wraps Up Its Shoot, Naga Chaitanya and Samantha Majili Movie Finishes the Shooting Schedule, Naga Chaitanya and Samantha Majili Movie Shooting Wrapped Up, Naga Chaitanya Majili Movie Shooting Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈసారి ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రియల్ లైఫ్ రొమాంటిక్‌ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. ఇక గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, నాగచైతన్య రఫ్ లుక్ హైలెట్ గా నిలిచాయి. ఇక తాజా అప్ డేట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఆఫ్టర్ మ్యారేజ్, చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలున్నాయి. మరి చూద్దాం ఆ అంచనాలను మజిలీ రీచ్ అవుతుందో లేదో?

[subscribe]

[youtube_video videoid=AZCJEgCH5Pk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =