వారం గ్యాప్‌లో వ‌స్తున్న స‌మంత‌

Double Dhamaka For Samantha Fans,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movies News,Samantha Akkineni Upcoming Movies in 2019,Actress Samantha New Movies Upadates,Samantha Next Project Details,Samantha Movies Coming With One Week Gap,Samantha Upcoming Films With Release Date
Double Dhamaka For Samantha Fans

గ‌త ఏడాది తెలుగునాట స‌మంత హ‌వా ఓ స్థాయిలో సాగింది. `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `అభిమ‌న్యుడు`, `యూ ట‌ర్న్‌`… ఇలా సామ్ న‌టించిన ప్ర‌తీ సినిమా త‌న‌కి మంచి పేరుని, విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో… ఈ ఏడాది కూడా అదే జోష్‌ని కొన‌సాగించే ప‌నిలో ఉంది ఈ అక్కినేని వారి కోడలు. ఈ వేస‌విలో సామ్ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆ చిత్రాలే `సూప‌ర్ డీల‌క్స్‌` (త‌మిళ్‌), `మ‌జిలీ`, `బేబి… ఎంత స‌క్క‌గున్నావె`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… వీటిలో `సూప‌ర్ డీల‌క్స్‌`, `మజిలీ` వారం రోజుల గ్యాప్‌లో రానున్నాయి. `సూప‌ర్ డీల‌క్స్‌` మార్చి 29న రిలీజ్ కానుండ‌గా… `మ‌జిలీ` ఏప్రిల్ 5న తెర‌పైకి రానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ స‌మంత న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లోనే న‌టిస్తోంది. `సూప‌ర్ డీల‌క్స్‌`లో కిల్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సామ్‌… `మ‌జిలీ`లో గృహిణి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మ‌రి… గ‌త ఏడాది వేస‌విలాగే ఈ సంవ‌త్స‌రం వేస‌వి కూడా సామ్‌కి మంచి ఫ‌లితాల‌ను అందిస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=xGA69pFMWTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =