ఈ 9 ఏళ్లలో రాణా నటించిన 10 చిత్రాలలో ద బెస్ట్ ఏది ?

10 Best Films of Rana, 2019 Latest Telugu Movies News, Actor Rana Daggubati Best Movies, Rana Daggubati Movies List, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vote For the Best Film of Rana, Vote For Your Favorite Rana Daggubati Film, Vote For Your Favorite Rana Movie
Vote For Your Favorite Rana Daggubati Film

పుట్టింది సినిమాలో… పెరిగింది సినిమాలో… తెలిసింది సినిమా… తెలుసుకుంది సినిమా…
సినిమాయే నిద్ర..
సినిమాయే దాహం…
సినిమాయే తిండి…
సినిమాయే సర్వస్వం…
సినిమాతో ఇంతగా మమేకమైపోయిన ఆ సినీజీవి మరెవరో కాదు… సుప్రసిద్ధ దివంగత నిర్మాత డి. రామానాయుడి మనవడు, డి.సురేష్ బాబు పెద్ద కుమారుడు అయిన దగ్గుపాటి రాణా. తండ్రి తాతల నుండి పుణికిపుచ్చుకున్న Film passion ఈ రోజున రాణా దగ్గుపాటిని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ పర్సనాలిటీగా నిలబెట్టింది. ఎప్పుడైనా, ఏ రంగంలోనైనా ఫలానా కొడుకు అవ్వటం వల్లనో, ఫలానా వారి వారసుడు అవ్వటం వల్లనో విజయాలు చేకూరవు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వారసత్వ బలానికి తమదైన స్వయంకృషి, పట్టుదలతోడైనప్పుడే ఎవరయినా రాణిస్తారు. రామానాయుడు అనే గొప్ప నిర్మాతకు సురేష్ బాబు అనే వారసుడు పదింతల బలమైయ్యారే తప్ప ఎప్పుడూ బరువు కాలేదు. అలాగే సురేష్ బాబుకు రాణా వంద రెట్లు బలమై నిలిచారే తప్ప బర్డన్ కాలేదు. నిజానికి రామానాయుడు కంటే సురేష్ బాబు.. సురేష్ బాబు కంటే రాణా దగ్గుపాటి అప్డేటెడ్ గా వ్యవహరిస్తారు. అలాంటి advanced థింకింగ్ అండ్ అప్రోచ్ కారణంగానే రాణా కేవలం పది సంవత్సరాల కాలంలోనే ఒక టాప్ ర్యాంక్డ్ ఫిలిం పర్సనాలిటీగా ఎదిగారు.

ఈరోజుకు అంటే 19 ఫిబ్రవరికి రాణా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై 9 సంవత్సరాలు పూర్తయింది.

2010 ఫిబ్రవరి 19న విడుదలైన “లీడర్” చిత్రంతో తెరంగేట్రం చేసిన రాణా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో చేసిన తెలుగు చిత్రాల సంఖ్య కేవలం పది మాత్రమే. హిందీ తమిళ భాషల్లో కూడా కలుపుకుంటే మరో ఐదారు చిత్రాలు ఉంటాయి. కానీ క్రేజ్ వైజ్ గా చూసుకుంటే రాణాకు ఆల్ ఇండియా లెవల్లో మోస్ట్ డిజైర్డ్ బ్యాచిలర్ గా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం తొమ్మిది సంవత్సరాల 10 చిత్రాల హీరోకు ఇంత క్రేజ్ ఏమిటి అని ఆశ్చర్యపోవచ్చు.కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇది కేవలం హీరో అయినంత మాత్రాన వచ్చిన క్రేజ్ కాదు. రానా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అన్ని విషయాల్లో కాలంతో పరుగు తీయగల ఆల్ రౌండర్ కావడమే ఈ క్రేజ్ కు కారణం.

విలక్షణ ,విశిష్ట పాత్రల ప్రత్యేక తరహా బహు భాషా నటుడిగా, నిర్మాతగా, విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టీవీ కార్యక్రమాల హోస్టుగా, హై రేంజ్ ఫిలిం ఈవెంట్స్ యాంకర్ గా తనను తాను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మర్ గా ఆవిష్కరించుకున్నాడు కాబట్టే రాణా కు టాలీవుడ్లోనే కాకుండా మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఒక ప్రత్యేక తరహా ఇమేజ్ ఏర్పడింది.

ఒక తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా హిందీ, తమిళ రంగాలలో కూడా ఒక రెగ్యులర్ యాక్టర్ గా పలు చిత్రాలలో నటించారు రాణా. ఇక “బాహుబలి” సిరీస్ ద్వారా జాతీయస్థాయిలో రాణా కు అద్భుతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.

2010 ఫిబ్రవరి 19 న విడుదలైన ‘లీడర్’ నుండి ఇప్పటివరకు రానా నటించిన తెలుగు చిత్రాలు ఏమిటో ఒకసారి చూద్దాం. లీడర్ తరువాత 2011 లో “నేను నా రాక్షసి”, 2012లో “నా ఇష్టం” చిత్రాలలో నటించిన రానాకు 2013,14 సంవత్సరాలలో తెలుగులో రిలీజ్ లు ఏమీ లేవు.2015లో “బాహుబలి” ద బిగినింగ్, “రుద్రమదేవి” చిత్రాలు విడుదల కాగా మరలా 2016లో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ఇక 2017 రానా పదేళ్ల కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మింగ్ ఇయర్ గా నిలుస్తుంది.2017 లో “ఘాజీ”, “బాహుబలి” ది కన్ క్లూజన్, “నేనే రాజు- నేనే మంత్రి”చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు రాణా. 2018లో ఆరోగ్య కారణాల దృష్ట్యా కొంత గ్యాప్ తీసుకున్న తరువాత ప్రస్తుతం మరల ఉద్ధృత స్థాయిలో విజృంభిస్తున్నాడు ఈ స్పెషల్ కేటగిరి రేర్ యాక్టర్. నటుడికి హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్ యాక్టర్ అనే వ్యత్యాసాలు ఉండవు… తనలోని నటుడిని సవాలు చేసే ఏ పాత్ర కైనా ‘సై’ అనటమే నటుడి లక్షణం అని నిరూపించిన అతి కొద్ది మంది నటులలో రాణా ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4, హాతీ మేరా సాథీ అనే హిందీ చిత్రాలలోనూ, హిరణ్యకశిపుడు, విరాట పర్వం 1945, ఎన్టీఆర్ మహా నాయకుడు చిత్రాలలోనూ నటిస్తున్నాడు రాణా .

కాగా ఈ తొమ్మిదేళ్ళలో తెలుగు, హిందీ, తమిళ భాషలలో మంచి మంచి పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రాణా ను అభినందిస్తూ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తాను నటించిన పది తెలుగు చిత్రాలలో మీకు బాగా నచ్చిన “ద బెస్ట్ ఆఫ్ రాణా” ఏదో తెలుసుకునేందుకు సరదాగా ఓ పోల్ గేమ్ పెట్టుకుందాం.

సో..కింద ఇస్తున్న రాణా 10 చిత్రాల నుండి ” ద బెస్ట్ ఆఫ్ రాణా” ను ఎంపిక చేయండి.
The poll begins now …

ఈ 10 ఏళ్లలో రాణా నటించిన 10 చిత్రాలలో ద బెస్ట్ ఏది ?

[subscribe]

[youtube_video videoid=20aZHly_zTY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =