అనుష్క థ్రిల్లర్ సినిమా – అవన్నీ రూమర్సే

Rana Daggubati Not A Part Of Anushka Latest Thriller,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Anushka Latest Thriller Movie News,Rana and Anushka: Not Likely To Happen Anytime Soon,Kona Venkat Brushes Rumours Aside,Anushka New Film Latest Updates
Rana Daggubati Not A Part Of Anushka Latest Thriller

కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి అనుష్క ఎప్పుడూ ముందే ఉంటుంది. అరుంధతి సినిమాతో తనలో ఉన్న మరో యాంగిల్ చూపించిన ఈ జేజమ్మ.. ఆ తరువాత భగ భగ భాగమతి అంటూ మరోసారి తన పాత్రతో మెప్పించింది. ఇక భాగమతి సినిమా తరువాత స్వల్ప విరామం తీసుకున్న అనుష్క మరోసారి థ్రిల్లర్ మూవీతో భయపెట్టడానికి ముందుకొస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో హేమంత్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కదా. మార్చి నుండి ఈసినిమా షూటింగ్ జరుపుకోనుంది. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరగనున్నట్టు గతంలోనే చెప్పారు కోన వెంకట్. మరో ప్రత్యేకత ఏంటంటే.. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటి వరకూ ప్రభాస్ అన్న గాసిప్ రాయుళ్లు..ఇప్పుడు తాజాగా మరో పేరును తెరపైకి తీసుకొచ్చారు. గత రెండు రోజులుగా ఈ సినిమాలో రానా అతిథి పాత్రలో నటిస్తున్నట్టు పలు వెబ్ సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంత మాత్రం లేదని తెలిసిపోయింది… కోన వెంకట్ సినిమాలో ప్రభాస్, రానా ఎవరూ నటించడం లేదని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది. మరి దీంతో ఈ సినిమాలో రానా నటిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్న క్లారిటీ వచ్చేసినట్టే కదా.

కాగా హేమంత్ దర్శకత్వం లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు.

[subscribe]

[youtube_video videoid=hlSN_rLuht0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =