వెంక‌టేష్‌ `సంక్రాంతి`కి 14 ఏళ్ళు

14 Years For Venkatesh Sankranti Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venkatesh Sankranti Movie Completed 14 Years,14 Years For Sankranti Movie,Sankranti Movie Latest UPdates
14 Years For Venkatesh Sankranti Movie

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. కెరీర్‌లో సింహ‌భాగం ఈ త‌ర‌హా చిత్రాల‌తోనే అల‌రించి… ప‌లు ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారాయ‌న‌. వాటిలో… 2005లో విడుద‌లైన `సంక్రాంతి` ఒక‌టి. త‌మిళ చిత్రం `ఆనందం` (2001)కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో వెంక‌టేష్‌కి జోడీగా స్నేహ‌, ఆర్తి అగ‌ర్వాల్ న‌టించ‌గా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో శ్రీ‌కాంత్‌, సంగీత‌, శివ‌బాలాజీ, ర‌తి, శ‌ర్వానంద్‌, చంద్ర‌మోహ‌న్‌, శార‌ద త‌దిత‌రులు న‌టించారు. ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించ‌గా… ఎస్‌.ఎ.రాజ్ కుమార్ స్వ‌రాలు అందించారు. ఫిబ్ర‌వ‌రి 18, 2005న విడుద‌లై మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మురిపించిన `సంక్రాంతి`… నేటితో 14 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`సంక్రాంతి` – కొన్ని విశేషాలు:

* `నువ్వు నాకు న‌చ్చావ్‌`, `వ‌సంతం` త‌రువాత వెంక‌టేష్‌, ఆర్తి అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. ఈ చిత్రంతో వెంకీ, ఆర్తి జోడీ `హ్యాట్రిక్ పెయిర్` అనిపించుకుంది.

* ఈ సినిమాలో వెంక‌టేష్‌కి జోడీగా తొలి సారిగా న‌టించిన స్నేహ‌… ఒరిజిన‌ల్ వెర్ష‌న్ `ఆనందం`లోనూ న‌టించింది. అయితే… ఇక్క‌డ ర‌తి పోషించిన పాత్ర‌ని అక్క‌డ స్నేహ చేసింది. క‌ట్ చేస్తే… నాలుగేళ్ళ త‌రువాత వ‌చ్చిన రీమేక్‌లో త‌నే మెయిన్ హీరోయిన్‌గా న‌టించ‌డం విశేషం.

* వెంక‌టేష్‌, ఎస్‌.ఎ.రాజ్ కుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ గా నిల‌చాయి. `సూర్య‌వంశం`, `రాజా`, `క‌లిసుందాం.. రా!`, `వ‌సంతం` త‌రువాత వ‌చ్చిన `సంక్రాంతి` కూడా అదే జాబితాలో చేరింది. ఈ సినిమానే ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆఖ‌రి చిత్రం కావ‌డం విశేషం.

* వెంక‌టేష్ – ఎస్‌.ఎ.రాజ్‌కుమార్ – సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. `సూర్య వంశం`, `రాజా`, `సంక్రాంతి` చిత్రాల‌తో ఈ త్ర‌యం హ్యాట్రిక్‌ని సొంతం చేసుకుంది.

* `రాజా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత వెంక‌టేష్‌, ముప్ప‌ల‌నేని శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `సంక్రాంతి` కూడా అదే వ‌రుస‌లో ఘ‌న‌విజ‌యం సాధించింది.

* `సంక్రాంతి` (2005) చిత్రంలో వెంక‌టేష్‌కి త‌మ్ముడిగా న‌టించిన శ‌ర్వానంద్‌… 2006లో వ‌చ్చిన `ల‌క్ష్మీ` చిత్రంలోనూ వెంక‌టేష్ త‌మ్ముడి పాత్ర‌లో న‌టించారు. ఈ రెండు సినిమాలూ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం విశేషం.

[subscribe]

[youtube_video videoid=zApfsNJJR8Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =