పోలీస్ అధికారి రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌?

Ram Charan To Play Cop Role For His Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019, Ram Charan New Movie Updates,Ram Charan to Play Police Officer Role in His Next Film,Mega Power Star Ram Charan Upcoming Movies,Ram Charan Next Movie News
Ram Charan To Play Cop Role For His Next

`తుఫాన్‌`, `ధ్రువ‌` చిత్రాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అల‌రించాడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. మ‌రోసారి… ఈ స్టార్ హీరో పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడని టాలీవుడ్ టాక్‌. అయితే… ఈ సారి పిరియాడిక్ ట‌చ్ ఉండ‌డమే ఆ పాత్ర ప్ర‌త్యేక‌త‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే… ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనే… చ‌ర‌ణ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… రెండు డిఫ‌రెంట్ టైమ్ లైన్స్‌లో న‌డిచే ఈ సినిమాలో 1920ల కాలం నాటి క‌థ‌తో పాటు 2020ల కాలం నాటి క‌థ కూడా మిక్స్ అయి ఉంటుంద‌ని… తెలుస్తోంది. 1920లో బ్రిటీష్ ప్ర‌భుత్వం టైమ్‌లో వ‌చ్చే ఎపిసోడ్స్‌లో రామ్ చ‌ర‌ణ్ పోలీస్ అధికారి రామ‌రాజు పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని… ఇటీవ‌లే ఆ స‌న్నివేశాలకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింద‌ని స‌మాచారం. పోలీస్ చెక్‌పోస్ట్ నేప‌థ్యంలో సాగే ఈ స‌న్నివేశాలు… అల‌రించేలా ఉంటాయ‌ని టాక్‌. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం… 2020 వేస‌విలో విడుద‌ల కానుంది. మ‌రి… రామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ఏ స్థాయిలో అల‌రిస్తాడో తెలియాలంటే అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=6-rm6wtc7Vg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =