ఆర్ఆర్ఆర్ – ట్రైనింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

NTR Starts Preparing For RRR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,RRR Movie Latest News,Rajamouli RRR Telugu Movie Latest Updates,Jr.NTR Physical Transformation For RRR,Jr.NTR New Look From RRR Movie,#RRR,Jr.NTR To Undergo A Stunning Physical Transformation For RRR
NTR Starts Preparing For RRR

బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయి.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఎనౌన్స్ మెంట్ రోజు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా… ఎప్పుడు చూద్దామా అన్న ఆత్రుతతో ఉన్నారు ప్రేక్షకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో ఉండగా.. ఎన్టీఆర్ రెస్టింగ్ మోడ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుండి లియోడ్ స్టీఫెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ ట్రైనింగ్ ను స్టార్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

[subscribe]

[youtube_video videoid=-fIckspYhns]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 7 =