నిర్మాత అవ‌తార‌మెత్తనున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

Gorgeous Heroine Kajal Aggarwal Turns Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actress Kajal Aggarwal Turns Producer,Kajal Aggarwal Latest Film News,Heroine Kajal New Movies Updates,Kajal Turns Producer,Kajal Next Project Details
Gorgeous Heroine Kajal Aggarwal Turns Producer

కాజ‌ల్ అగ‌ర్వాల్‌… యువ‌త‌రం క‌ల‌ల‌రాణి. ఈ నెల 15తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర‌కాలం పూర్తి కావ‌స్తోంది. మొద‌టి తెలుగు చిత్రం `ల‌క్ష్మీ క‌ళ్యాణం` రోజుల్లో ఎలా ఉందో… ఇప్ప‌టికీ అలాగే వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో అభిమానుల‌ను పెంచుకుంటూ… అగ్ర క‌థానాయిక‌గా దూసుకుపోతోంది కాజ‌ల్‌. దాదాపు టాప్ హీరోలంద‌రితోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ‌… అతి త్వ‌ర‌లో స‌రికొత్త అవ‌తారం ఎత్త‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్‌లో వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… కాజ‌ల్ త్వ‌ర‌లోనే నిర్మాణ రంగంలోకి ఎంట‌ర్ అవుతోంద‌ని స‌మాచారం. `కె.ఎ.వెంచ‌ర్‌` పేరుతో కాజ‌ల్ ఓ బేన‌ర్‌ను పెట్టి… త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌ అందించ‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వర్గాల క‌థ‌నం. గ‌త ఏడాది `అ!` చిత్రాన్ని రూపొందించి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు పొందిన ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్లాన్ చేసిందట కాజ‌ల్‌. త్వ‌ర‌లోనే కాజ‌ల్ సొంత నిర్మాణ సంస్థ‌ సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చు. క‌థానాయిక‌గా శిఖ‌ర స్థాయికి చేరుకున్న కాజ‌ల్‌… నిర్మాణ రంగంలోనూ అదే స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం!

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =