నాని సినిమాలో అదా శ‌ర్మ ప్ర‌త్యేక గీతం?

Adah Sharma To Shake Leg With Natural Star Nani,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actress Adah Sharma New Movie News,Adah Sharma Special Song in Nani New Movie,Adah Sharma Special Song in Nani Jersey Film,Nani Jersey Movie Latest Updates,
Adah Sharma To Shake Leg With Natural Star Nani

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `జెర్సీ`. ఇందులో రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు నాని. ఒక‌టేమో యంగ్ రంజీ ప్లేయ‌ర్ రోల్ కాగా… మ‌రొక‌టి ఆ క్యారెక్ట‌ర్‌కు తండ్రి పాత్ర‌. రెండో పాత్ర‌లోనే… మ‌ధ్య వ‌య‌స్కుడైన క్రికెట‌ర్ అర్జున్ గానూ క‌నిపించ‌నున్నాడ‌ట నాని. అంతేకాదు… ట్రాజిక్ ఎండింగ్‌తో ఈ సినిమా ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో క‌థానుసారం ఓ ప్ర‌త్యేక గీతానికి కూడా స్థాన‌ముంద‌ని… ఆ పాట‌లో అందాల తార అదా శ‌ర్మ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అదా ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా… క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ `యూట‌ర్న్‌`లో హీరోయిన్‌గా న‌టించిన శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌గా… `మ‌ళ్ళీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. కోలీవుడ్ యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ భాణీలు అందిస్తున్నాడు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 19న `జెర్సీ` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=qih-MjaRwnw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + six =