యూవీ క్రియేష‌న్స్‌లో నాగ‌చైత‌న్య‌?

Naga Chaitanya To Work With UV Creations,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Naga Chaitanya Teaming Up With UV Creations,Hero Naga Chaitanya New Movie News,Naga Chaitanya Next With UV Creations,Naga Chaitanya NeW Film News,Naga Chaitanya Upcoming Movies Updates
Naga Chaitanya To Work With UV Creations

ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న యువ క‌థానాయ‌కుల్లో అక్కినేని నాగ‌చైత‌న్య ఒక‌రు. త‌న శ్రీ‌మ‌తి స‌మంత‌తో పెళ్ళ‌య్యాక న‌టిస్తున్న `మ‌జిలీ` సినిమా తుది ద‌శ‌లో ఉండ‌గా… త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌ల‌సి న‌టించ‌నున్న `వెంకీ మామ‌` త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముస్తాబవుతోంది. అలాగే త‌న తండ్రి కింగ్ నాగార్జున కాంబినేష‌న్‌లోనూ `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు చైతూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… `దిల్‌` రాజు నిర్మాణంలో శ‌శి అనే నూత‌న ద‌ర్శ‌కుడితో ఓ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. అలాగే `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌నున్నాడట చైతూ. వీటితో పాటు.. మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా చైతూ ఓకే చెప్పాడ‌ట‌. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ డైరెక్ష‌న్‌లోనూ ఈ యంగ్ హీరో న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ని టాక్‌. మొత్త‌మ్మీద‌… ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా చేతినిండా సినిమాల‌తో ముందుకు సాగుతున్నాడు ఈ అక్కినేని వారి థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ హ్యాండ్స‌మ్ హీరో.

[subscribe]

[youtube_video videoid=B7cm2UcOYV0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − four =