సూర్య ఎన్.జి.కె టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Suriya NGK Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Movie Updates,Telugu Film News 2019,Telugu Cinema News,NGK Teaser Release Date Confirmed,Suriya NGK Telugu Movie Teaser Release Date Fixed,NGK Teaser Releasing on 14th Feb 2019
Suriya NGK Movie Teaser Release Date Locked

తమిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్.జి.కె (నంద గోపాల‌న్ కుమార‌న్). పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి14 వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో సూర్య సరసన ర‌కుల్ ప్రీత్ సింగ్, సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. వారియ‌ర్ డ్రీమ్ పిక్చ‌ర్స్‌, రిలయ‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లు. యువన్ శంక‌ర్ రాజా సంగీత ద‌ర్శకుడు. మరి గత ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. మరి ఈ ఏడాది ఎప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=7zaC2gTGA2o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =