`దేవ్‌` ర‌న్ టైమ్ అప్‌డేట్‌

Karthi and Rakul Preet Dev Movie Runtime Locked,TeluguFilm Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Dev Movie Runtime Fixed,Dev Movie Runtime Confirmed,Karthi and Rakul Preet Dev Movie Latest Updates,Dev Movie Runtime Revealed,Karthi Dev Movie Latest News
Karthi and Rakul Preet Dev Movie Runtime Locked

`ఖాకి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి, అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `దేవ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ర‌విశంక‌ర్ రూపొందించిన ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత‌మందించాడు. గ‌తంలో సూర్య న‌టించిన ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు హారిస్ స్వ‌రాలందించ‌గా… కార్తి కాంబినేష‌న్‌లో హారిస్ బాణీలందించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం. కాగా… అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌గా ఈ నెల 14న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి `క్లీన్ యు` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. అంతేకాదు… ఈ సినిమా ర‌న్ టైమ్ 158 (2 గంట‌ల 38 నిమిషాలు) ఉంటుంద‌ని తెలిసింది. మ‌రి… `ఖాకి` త‌రువాత మ‌రోసారి జోడీక‌ట్టిన కార్తి, ర‌కుల్ జంట మ‌రోసారి మెప్పిస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=yhH3S6PdY7U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =