యాత్ర కు ఫిబ్రవరి సెంటిమెంట్ కలిసొచ్చిందా!

Did February Sentiment Work For Yatra?,Telugu Filmnagar,TeluguFilm Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Latest Updates,Will February Sentiment Work For Yatra Movie,Yatra Telugu Movie Updates
Did February Sentiment Work For Yatra?

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కామన్ అయిపోయాయి. పలానా డైరెక్టర్, హీరో కలిసి సినిమా చేస్తే హిట్టని.. పలనా రోజు సినిమా రిలీజ్ చేస్తే హిట్టవుతుందని… ఇలా చాలా సెంటిమెంట్లనే ఫాలో అవుతారు మన సినీ ప్రముఖులు. అందులో ఎంత నిజముందో.. యాదృశ్చికంగా జరుగుతాయో తెలియదు కానీ… మన వాళ్లు మాత్రం ఆ సెంటిమెంట్స్ ను పాటిస్తుంటారు. ఇప్పుడు తాజాగా యాత్ర సినిమాకు కూడా ఈ సెంటిమెంట్ కలిసొచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటనుకుంటున్నారా? ఫిబ్రవరి సెంటిమెంట్. గతంలో ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలు మంచి ఘన విజయం సాధించాయి. దీంతో ఫిబ్రవరి సెంటిమెంట్ యాత్ర కూడా కలిసొచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిర్చి:

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ కి మంచి ఊపునిచ్చిన సినిమా మిర్చి. 2013 ఫిబ్రవరి 8న రిలీజైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది. 2013 ఫిబ్రవరి 8న రిలీజైన ఈ సినిమా మొదటిరోజే పాజిటివ్ టాక్ ను అందుకొని అప్పట్లో భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది. ప్రభాస్ నటన..డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాకు కలిసొచ్చాయి. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల వరకు లాభాలను అందించింది.

ఛలో:

ఇక ఇదే ఫిబ్రవరి నెలలో విడుదలైన మరో సినిమా ఛలో. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. ఆ ఇంప్రెషన్ తోనే వరుస సినిమాలు చేసిన ఏ సినిమా కూడా మంచి విజయం సాధించి పెట్టలేకపోయాయి. అయితే ఆ తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. ఈసినిమా ఎప్పుడు రిలీజైందో తెలుసా. ఫిబ్రవరి 2 వ తేదీన 2018 లో ఈ సినిమా రిలీజైంది.

యాత్ర:

మరి ఇప్పుడు యాత్ర సినిమా కూడా ఫిబ్రవరి నెలలో విడుదలైంది. దీంతో ఈ ఫిబ్రవరి సెంటిమెంట్ కలిసొచ్చిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పాదయాత్ర నేపథ్యంలో… మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యాత్ర. ఈ సినిమా కూడా నిన్న ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజైంది. నిన్న విడుదలైన ఈసినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. రాజకీయాలకు అతీతంగా తీసిన ఈ సినిమా అటు వైఎస్, జగన్ అభిమానులకే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి సైతం నచ్చేసింది. మరి యాదృశ్చికంగా కలిసొచ్చిందో..లేక సెంటిమెంట్ ఏదైనా ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ.. ఈ సినిమాకు కూడా మరోసారి ఫిబ్రవరి సెంటిమెంట్ వర్కవుట్ అయిందంటున్నారు.

[subscribe]

[youtube_video videoid=CG2prtM2O70]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fourteen =