సీమరాజా తెలుగు మూవీ రివ్యూ

Seema Raja Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Seema Raja Movie Review,Seema Raja Review,Seema Raja Movie Review and Rating,#SeemaRajaReview,Latest Telugu Movie Reviews,Seema Raja Movie Live Updates,Seema Raja Movie Plus Points,Seema Raja Movie Story,Seema Raja Movie Public Talk,Seema Raja Movie Public Response
Seema Raja Telugu Movie Review

పొణ్రమ్ దర్శకత్వంలో తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్, సమంత జంటగా తమిళ్ లో తెరకెక్కిన సినిమా సీమరాజా. తమిళ్ లో మంచి హిట్టందుకున్న ఈసినిమాను అదే పేరుతో తెలుగులో ఈరోజు తెలుగులో రిలీజ్ చేశారు. మరి తమిళ్ లో హిట్టయిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చింది.. ఇక్కడ కూడా సినిమా హిట్టయిందా?లేదా? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : శివ కార్తికేయన్ , సమంత, సిమ్రాన్ ,సూరి
దర్శకత్వం : పొణ్రమ్
నిర్మాత : ఆర్ డి రాజా
సంగీతం : ఇమ్మాన్
ఎడిటర్ : వివేక్ హర్షన్

కథ :

సీమరాజా (శివ కార్తికేయన్) రాజుల వంశానికి చెందినవాడు. ఎలాంటి బాధ్యతలు లేకుండా… తనకు ఉన్న ఆర్ధిక బలంతో ఊర్లో తన ఇమేజ్ ను పెంచుకోవడం కోసం అందరికీ దానాలుచేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా సీమరాజా పక్కన ఊరిలో ఉండే క్రిష్ణయ్య పలు అక్రమాలకు పాల్పడుతూ కోటీశ్వరుడిగా ఎదుగుతాడు. అంతేకాదు.. రెండు ఊర్లకు మధ్య గొడవలను సృష్టిస్తుంటాడు. ఇదే క్రమంలో కృష్ణయ్య మొదటి భార్య కూతురైనా లక్ష్మీ (సమంత) ని ప్రేమిస్తాడు. అయితే వాళ్ల పెళ్లికి కృష్ణయ్య ఒప్పుకోడు. అక్కడితో ఆగకుండా.. ఆ ఊరి వాళ్లందరి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో సీమరాజా బాద్యత తెలుసుకొని ఊరి ప్రజల కోసం కృష్ణయ్యను ఎదురిస్తాడు.? ఆ తరువాత సీమరాజా కు ఎదురయ్యే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరిస్తాడు? లక్ష్మీ, సీమరాజా ఎలా కలుస్తారు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

రెండు ఊళ్ల మధ్య జరిగే సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమాలు గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఇక ఒక బాధ్యతలు లేని హీరో… తరువాత బాధ్యతగా మారే కథనంతో వచ్చిన సినిమాలు కూడా చాలానే వచ్చాయి. పాత లైన్ నే తీసుకొని కొత్తగా చూపే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాకు శివ కార్తికేయన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లా అయిపోయింది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో చాలా ఈజీగా నటించాడు. ఆ డిఫరెన్స్ ను చూపించగలిగాడు. ఇక విలేజ్ అమ్మాయిగా నటించిన సమంత చాలా గ్లామర్ గా కనిపించింది. శివ కార్తికేయన్ , సమంత కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర సిమ్రాన్ ది. ఈ సినిమాలో విలన్ భార్య గా నటించిన సిమ్రాన్ తన నటనతో సినిమాను రక్తికట్టించేలా చేసింది. ఇక సినిమాకు సెకండ్ హాఫ్ కూడా మరో ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. యుద్ధ సన్నివేశాలకు సంబంధించి విఎఫ్ ఎక్స్ ఎఫెక్స్ట్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచాయి. ఇక సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. నిర్మాణవిలువలు చాలా రిచ్ గా వున్నాయి.

అయితే ఊ సినిమాకి స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ బాగున్నా దాన్ని తెర మీదకు తీసుకువచ్చిన విధానం బాగాలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా విసిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసివుంటే ఇంకా బావుండేది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్క్రీన్ ప్లే తోడైతే సినిమా వేరే స్థాయిలో ఉండేది.

మరి రెమో తరువాత శివ కార్తికేయన్ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చాడు. యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుంది… కానీ అందరూ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే…

ప్లస్ పాయింట్స్:
శివ కార్తికేయన్
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే

సీమరాజా తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3

[subscribe]

[youtube_video videoid=xGA69pFMWTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 19 =