ప‌్ర‌భాస్ `మిర్చి`కి ఆరేళ్ళు

6 Years Completed For Prabhas Mirchi Movie, 6 Years For Mirchi Movie, 6 Years For Prabhas Mirchi Movie, Latest Telugu Movies 2019, Prabhas Mirchi 6 Years Complete, Prabhas Mirchi Movie Completes 6 Years, Prabhas Mirchi Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
6 Years For Prabhas Mirchi Movie

`క‌టౌట్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డూడ్‌`… ఈ డైలాగ్ థియేట‌ర్ల‌లో తొలిసారిగా వినిపించి ఈ రోజుకి ఆరేళ్ళు పూర్త‌వుతోంది. క‌రెక్ట్‌గా చెప్పాలంటే… యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ని మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసిన ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `మిర్చి` విడుద‌లై ఆరేళ్ళు అవుతోంది. అలాగే… వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తొలిసారిగా మెగాఫోన్ ప‌ట్టిన సినిమా రిలీజై ఆరు వ‌సంతాలు. పేరుకి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అయినా… కుటుంబ బంధాల‌కు, మాన‌వ విలువ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌మిచ్చి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు కొర‌టాల‌. ప్ర‌భాస్ కెరీర్‌లో ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌చిన ఈ చిత్రంలో అనుష్క‌, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా న‌టించారు. స‌త్య‌రాజ్‌, న‌దియా, సంప‌త్ రాజ్‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మానందం, నాగినీడు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో పాట‌ల‌న్నీ జ‌నాద‌ర‌ణ పొందాయి.

`మిర్చి` – కొన్ని విశేషాలు
* స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యూవీ క్రియేష‌న్స్ నిర్మించిన తొలి చిత్ర‌మిది. ప్ర‌స్తుతం ఇదే సంస్థ ఆరేళ్ళ త‌రువాత ప్ర‌భాస్‌తో భారీ బ‌డ్జెట్ మూవీ `సాహో` నిర్మిస్తోంది. ఆగ‌స్టు 15న ఈ త్రిభాషా చిత్రం తెర‌పైకి రానుంది.
* తెలుగులో టాలెంటెడ్ యాక్ట్ర‌స్ న‌దియా రీ-ఎంట్రీ ఇచ్చిన చిత్రం
* ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ క‌ళా ద‌ర్శ‌కుడు (ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌), ఉత్త‌మ విల‌న్ (సంప‌త్ రాజ్‌), ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు (కైలాష్ ఖేర్ – పండ‌గ‌లా దిగివ‌చ్చాడు)… ఇలా ఆరు విభాగాల్లో `నంది` పుర‌స్కారాల‌ను అందుకుందీ సినిమా.
* క‌న్న‌డంలో `మాణిక్య‌` పేరుతోనూ… బెంగాలీలో `బిందాస్‌` పేరుతోనూ… ఒడియాలో `బిశ్వ‌నాథ్‌` పేరుతోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here