4 లెటర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్

4 Letters Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,4 Letters Telugu Movie Trailer,4 Letters Trailer,4 Letters Telugu Movie Official Trailer,#4LettersTrailer,4 Letters Movie Theatrical Trailer,4 Letters Movie Latest Updates
4 Letters Movie Trailer Out Now

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఇంకా ఈ సినిమాలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ తదితరులు నటిస్తున్నారు. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ సినిమాను దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here