క్రిష్ అప్పటినుండే నా సినిమా అంటున్నారు!

kangana Ranaut Latest Comments On Krish,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,kangana Ranaut Comments on Director Krish,kangana Ranaut About Krish,kangana Ranaut Comments on Manikarnika Movie Director Krish,kangana Ranaut Latest News
kangana Ranaut Latest Comments On Krish

మణికర్ణిక సినిమా వివాదం ఇప్పటికే పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాపై క్రిష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేకెత్తిస్తున్నాయి. సినిమా 70 శాతం షూటింగ్ తానే చేశానని… కానీ కంగన మొత్తం తానే డైరెక్షన్ చేసినట్టు చెప్పుతోందని.. క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన చెల్లి స్పందించడం… ఆ తరువాత మరొకరు.. సినిమాలో పని చేసిన ఆర్టిస్తులు ఇలా ఒకరి తరువాత ఒకరు స్పందించడంతో పెద్ద దుమారమే రేగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అసలు స్పందించాల్సిన కంగన కూడా రెండు రోజుల క్రితం స్పందించి… ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించాను అని తేల్చి చెప్పేసింది. అంతేనా… క్రిష్ కు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది ప్రొడ్యూసర్ తో మాట్లాడుకోవాలి.. క్రిష్‌ ఇలా నన్ను ఎటాక్‌ చేయడం సరికాదు… ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి… మీడియాతో మాట్లాడితే ఆయనకు ఎటువంటి లాభం లేదని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసింది.

ఇప్పుడు తాజాగా మరోసారి క్రిష్ పై పలు వ్యాఖ్యలు చేసింది కంగనా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాను ‘క్రిష్‌కు సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వలేదట? అని అడుగగా.. ‘విడుదలకు ముందు డిసెంబరు నెలలో క్రిష్‌కు సినిమా చూపించాలి అనుకున్నాం.. అప్పటికే క్రిష్ కు సినిమాపై నమ్మకం పోయింది.. మేమేదో సినిమాను నాశనం చేశామన్న ఫీలింగ్ లో ఉన్నారు.. అందుకే చూడలేదు.. ఎన్నో సార్లు పిలిచాం.. కానీ రాలేదు… కానీ ఇప్పుడు సినిమా చూశాక ఆయనకు నచ్చింది..ఇప్పుడు ‘ఇది నా సినిమా’ అంటున్నారంది. నిజానికి ఆయనకు మేం క్రెడిట్ ఇచ్చాం… కానీ ఆయన మీడియా ముందుకు ఎందుకు వచ్చారు?.. నేరుగా నన్ను కలిసి మాట్లాడి ఉండొచ్చుగా? అని ప్రశ్నించారు. మరి దీనిపై క్రిష్ ఎలా స్పందిస్తారో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=LlHI_pFQSOA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =