లక్ష్మీస్ ఎన్టీఅర్ ట్రైలర్ రిలీజ్ పై వర్మ ట్విస్ట్

RGV Announces Lakshmi’s NTR Trailer Release Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lakshmi’s NTR Trailer Release Date,Lakshmi’s NTR Trailer Release Date Fixed,RGV Revealed Release Date of Lakshmi’s NTR Trailer,Lakshmi’s NTR Trailer Release Date Confirmed,Lakshmi’s NTR Trailer Gets a Release,Lakshmi’s NTR Trailer Release Locked,RGV About Lakshmi’s NTR Trailer,Lakshmi’s NTR Movie Latest Updates
RGV Announces Lakshmi’s NTR Trailer Release Date

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో లక్ష్మీ పార్వతి రాకముందు వరకూ ఉంటే… లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నుండి ఉంటుందని చెప్పడంతో ఆది నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు తన ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరోసారి తన ట్విట్టర్ ద్వారా ఆసక్తికరమైన ట్వీట్ లు చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడవుతుందంటే… ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ పై అది ఆధారపడి ఉంటుందని…మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే..ట్రైలర్ రిలీజ్ ప్రకటిస్తానని చెప్పారు. అంతేనా ఇంకా పలు ట్వీట్లు చేశారు.

వాటిలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్‌ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్‌ నాకు సందేశం ఇచ్చారు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తరువాత లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రిలీజ్ చేయాలని చెప్పారన్నారు.

మరొక ట్వీట్ లో ఎన్టీఆర్ ఆయన సొంత కొడుకు కథానాయకుడును కాకుండా భార్య లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆశీర్వదిస్తారు అనటానికి కథానాయకుడు రిజల్టే నిదర్శనం. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ల మధ్య పోటీని ఆయన స్వాగతిస్తారు’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

మరి ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ సరిగ్గా రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం ఆశించినంత లేకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో.. వర్మ ఎప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేడ్ ఫిక్స్ చేస్తాడో చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=l09mrSOU37o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 6 =