Mr. మజ్ను మూవీ రివ్యూ

Mr.Majnu Movie Review,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Mr.Majnu Telugu Movie Review,#Mr.MajnuReview,Mr.Majnu Review,Latest Telugu Movie Reviews,Mr.Majnu Movie Review and Rating,Mr.Majnu Movie Public Talk,Mr.Majnu Movie Public Response,Mr.Majnu Movie Story,Mr.Majnu Movie Plus Points,Mr.Majnu Movie Live Updates
Mr.Majnu Movie Review

‘తొలిప్రేమ’తో విజ‌యాన్ని అందుకున్న యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. ఎన్నో అంచనాలు ఏర్పరుచుకున్న ఈసినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో? ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలుసుకోవాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్ , సితార తదితరులు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
సంగీతం : ఎస్ తమన్
ఎడిటర్ : నవీన్ నూలి

కథ:

విక్కీ (అఖిల్‌) యూకేలో ఎంఎస్‌ చేస్తుంటాడు. అమ్మాయిలను తన మాటలతో ఆకర్షిస్తూ క్షణాల్లోనే పడేసే రొమాంటిక్ ప్లే బాయ్. కానీ హీరోయిన్ నిక్కి (నిధి అగర్వాల్) స్వభావం పూర్తిగా డిఫరెంట్. త‌న‌కి కాబోయేవాడు శ్రీరాముడిలా ఉండాల‌ని క‌ల‌లు కనే ఓ సాధారణ అమ్మాయి. అలాంటి విరుద్దమైన స్వభావాలు ఉన్న వీరిద్దరూ కొన్ని పరిస్థితుల కారణంగా ఒకరినొకరు కలవాల్సి వస్తుంది. మొదట విక్కీ స్వభావాన్ని చూసి అసహ్యించుకునే నిక్కీ.. ఆ తరువాత తన మనసేంటో తెలుసుకొని ప్రేమలో పడుతుంది. కానీ విక్కీ మాత్రం త‌న‌కి ఎక్కువ రోజులు ప్రేమించ‌డం తెలియ‌ద‌ని చెప్ప‌డంతో, మొద‌ట రెండు నెల‌లు ప్రేమించుకుని చూద్దాం అంటుంది. దానికి ఒప్పుకున్న విక్కీ తరువాత క్రమంలో తాను కూడా నిక్కీ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా నిక్కీ, విక్కీ ఇద్దరు విడిపోతారు. మళ్ళీ విక్కీ, నిక్కీ ఎలా కలిసారు ? విక్కీ, నిక్కీ ప్రేమను దక్కించుకోవడానికి ఏమి చేసాడు ? చివరకి ఇద్దరూ ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

తొలిప్రేమ తరువాత వెంకీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉండటం కామన్. ప్లే బాయ్ క్యారెక్టరైజేషన్ కు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. ఎమోషనల్ సన్నివేశాలను.. అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలను సమానంగా చూపించడంలో మంచి పనితనం చూపించారు. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బావుండేదనిపిస్తుంది.

ఇక అఖిల్ గురించి చెప్పాలంటే తాను గతంలో చేసిన సినిమాల్లో కంటే కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ప్లే బాయ్ క్యారెక్టర్ లో ఎంత బాగా నటించాడో… ఎమోషన్ సన్నివేశాల్లో కూడా అంతే చక్కగా నటించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త డెప్త్, పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ గా చేసిన నిథి అగర్వాల్ కూడా బాగానే నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది.

కమెడియన్స్ ప్రియదర్శి, హైపర్ ఆది కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించారు. అలాగే నాగబాబు, రావు ర‌మేష్‌, జయప్రకాశ్, సుబ్బరాజు, అజయ్, సితార తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక తమన్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఈసినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. ప్రతి సీన్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది. లండన్ లో సీన్స్ అన్నీ చాలా బ్యాటిఫుల్ గా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి.

ఫస్టాఫ్ మంచి ఫీల్ గుడ్ సినిమాలా అనిపిస్తుంది. సాఫీగా సాగిపోతుంది. కానీ సెకండాఫ్ మాత్రం అక్కడక్కడా కొంచం స్లోగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉండి ఉంటే సినిమా వేరే రకంగా ఉండేది.

ప్లస్ పాయింట్స్:

అఖిల్ నటన
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:

కథ
సెకండాఫ్

Mr. మజ్ను మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

 

[subscribe]

[youtube_video videoid=z2HY5DL598g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =