విక్ట‌రీ వెంక‌టేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్ డేట్‌

Latest Update About Venkatesh New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Victory Venkatesh Next Project Updates,Venkatesh New Movie News,Venkatesh Latest Film Details,Hero Venkatesh Upcoming Movies
Latest Update About Venkatesh New Movie

`ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యం… సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. `గురు` వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత… 21 నెల‌ల గ్యాప్ అనంత‌రం వ‌చ్చిన `ఎఫ్ 2`… వెంకీ కెరీర్‌లో మ‌ర‌పురాని విజ‌యాల‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఒక వైపు ఈ సినిమా విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే… మ‌రో వైపు త‌దుప‌రి చిత్రాల‌ను పట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు ఈ మోస్ట్ టాలెంటెడ్ హీరో. త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించ‌నున్న `వెంకీ మామ‌` త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్ళ‌నుండ‌గా… అదే స‌మ‌యంలో సోలో హీరోగా మ‌రో ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళ‌నున్నారు వెంకీ. `నేను లోక‌ల్‌` ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించి… స్క్రిప్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని స‌మాచారం. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా… వెంకీ మార్క్ కామెడీతో ఈ చిత్రం ఉంటుంద‌ని టాక్‌. అలాగే… ఈ రెండు చిత్రాల త‌రువాత ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలోనూ వెంకీ ఓ సినిమా చేయ‌నున్నాడు. మొత్తానికి… వెంకీ వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌న్న‌మాట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=zApfsNJJR8Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + sixteen =