మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చిన త‌మ‌న్నా

Tamannaah Is Back With A Bang,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia New Movie Updates,Actress Tamannaah Bhatia Next Film Updates,Heroine Tamannaah Bhatia Is Back With A Bang
Tamannaah Is Back With A Bang

కథానాయిక‌గా త‌మ‌న్నాది ప‌ద‌మూడేళ్ళ న‌ట ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో… తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టించి ఆ యా ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌దైన ముద్ర వేసింది ఈ మిల్కీ బ్యూటీ. అయితే… గ‌త కొంత‌కాలంగా త‌మ‌న్నాకి అంత‌గా టైమ్ క‌ల‌సిరావ‌డం లేద‌నే చెప్పాలి. `బాహుబ‌లి – ది బిగినింగ్‌` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌` చిత్రంలో అయితే ఆమెది దాదాపు అతిథి పాత్రే. ఈ నేప‌థ్యంలో… విజ‌యం కోసం చెకోర ప‌క్షిలా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి… సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. హారిక పాత్ర‌లో త‌న నట‌న‌తో, కామెడీ టైమింగ్‌తో, గ్లామ‌ర్‌తో త‌మ‌న్నా అల‌రించింది. అలాగే.. వెంక‌టేష్ ప‌క్క‌న చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించింది. మ‌రి… ఇదే ఊపులో ఈ ఏడాది `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌తోనూ… త‌మ‌న్నా తెలుగు నాట జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తుందేమో చూడాలి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here