సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ ‘నెంబ‌ర్‌వ‌న్‌’కు 25 ఏళ్ళు

25 Years For Superstar Krishna No 1 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,No 1 Movie Updates,No 1 Telugu Movie Latest News,Superstar Krishna No 1 Movie Latest News,Superstar Krishna No 1 Movie Completed 25 Years
25 Years For Superstar Krishna No 1 Movie

జ‌న‌వ‌రి 14… ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు విడ‌దీయ‌రాని అనుబంధ‌ముంది. ఇదే రోజున కృష్ణ న‌టించిన 15 చిత్రాలు విడుద‌లయ్యాయంటే… ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కున్న ప్ర‌త్యేక అనుబంధం ఏమిటో అర్థంచేసుకోవ‌చ్చు. ఆ చిత్రాల జాబితాలో ‘నెంబ‌ర్‌వ‌న్’ ఒక‌టి. కృష్ణ‌, సౌంద‌ర్య జంట‌గా ఎస్‌.వి.కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో… మ‌హేష్ ఆనంద్ విల‌న్‌గా ఓ ఇంట‌రెస్టింగ్ రోల్ లో క‌నిపించ‌గా… కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ఆలీ, బాబూమోహ‌న్‌, ‘మ‌హ‌ర్షి’ రాఘ‌వ‌, గుండు హ‌నుమంత‌రావు, శ్రీ‌ల‌త, శివాజీరాజా, రాజార‌వీంద్ర‌, సుబ్బ‌రాయ శ‌ర్మ‌, వై.విజ‌య ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ, రొమాన్స్‌… ఇలా అన్ని అంశాల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన‌ ‘కోలో కోలో కోలోయ‌మ్మ‌’, ‘ఛాంగుభ‌ళ బాగుంది’, ‘ఎంత‌నాటు ప్రేమో’, ‘అంద‌మైన‌ది’ పాట‌లు ఇప్ప‌టికీ శ్రోతలను అల‌రిస్తూనే ఉంటాయి. ఈ సినిమాను మిథున్ చ‌క్ర‌వ‌ర్తి హీరోగా ‘దాన్‌వీర్’ పేరుతో హిందీలోను రీమేక్ చేసారు. జ‌న‌వ‌రి 14, 1994న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం… నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here