రామ్ గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. టైటిల్ తోనే సినిమాపై ఫస్ట్ నుండి హైప్ పెంచిన వర్మ దాని తరువాత వరుసపెట్టి పాటలు విడుదల చేస్తూ అటు విమర్శల తో పాటు ఇటు కొంతమంది వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. వెన్నుపోటు అని విడుదల చేసిన మొదటి పాటతోనే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తినిపుట్టించాడు. దాని తరువాత ఎందుకు? అనే పాట విడుదల చేసి మరోసారి మరో సంచలనానికి తెర తీశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా…ఇప్పటివరకూ అసలు ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో ఎవరు నటిస్తున్నారో వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంతకీ ఆపాత్రలో నటిస్తుంది ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు…కన్నడ నటి యజ్ఞా శెట్టి. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో వీరప్పన్ భార్యగా నటించిన యజ్ఞాను ఇప్పుడు లక్ష్మీపార్వతి పాత్ర కోసం తీసుకొచ్చాడు వర్మ.
దానితో పాటు మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు వర్మ. కన్నడ నటి యజ్ఞ శెట్టితో పాటు ఈ సినిమాలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశాడు. అయితే ఆ లుక్ ఎవరిదో చెప్పకుండా…లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈయన ఏ పాత్ర చేస్తున్నాడో చెప్పగలరా? అంటూ క్వశ్చన్ కూడా వేశాడు. అయితే ఆ లుక్ చూస్తుంటే ఈజీగా చంద్రబాబు నాయుడు పాత్ర అని అర్దమవుతుంది లెండి. అయితే ఈ లుక్స్ ను బట్టి చూస్తుంటే వర్మ సెలక్షన్ బాగానే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు పాత్రకు హీరో శ్రీతేజ్ సరిగ్గా సరిపోయినట్టు కనిపిస్తోంది. మరి పాటలు, లుక్స్ తోనే హీట్ పెంచుతున్న వర్మ సినిమాతో ఇంకెంత హీట్ పెంచుతాడో చూద్దాం..
[youtube_video videoid=oL3qA7A3Nbo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: