జెర్సీ సినిమా టీజర్ రిలీజ్

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుపుతున్న చిత్రయూనిట్…ఈ నేపథ్యంలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇటీవల నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి చూద్దాం నానికి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చిపెడుతుందో..

[subscribe]

[youtube_video videoid=Rl6T0bM94Qs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =