అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో

Hollywood Actor Michael Madson in Anushka New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kill Bill actor Michael Madsen joins Anushka Shetty,Finally Anushka Shetty gets Hollywood Villain
Hollywood Actor Michael Madson in Anushka New Movie

భాగ‌మ‌తి మూవీ త‌ర్వాత దాదాపు అనుష్క సినిమా వచ్చి దాదాపు సంవ‌త్స‌రమైపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకూ అనుష్క కొత్త సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. ఇక ఈ ఏడాది అనుష్క కొత్త మూవీకి సైన్ చేసింది. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో… హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో హాలివుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘మైఖేల్ మాడ్సన్’ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుండటంతో… అక్కడి షూటింగులో ఆయన పాల్గొంటాడట. దీంతో హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. మరి చూద్దాం హాలీవుడ్ హీరోనే ఈసినిమాలో చేస్తున్నాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..

కాగా హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై కోన వెంక‌ట్ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here