వినయ విధేయ రామ మూవీ రివ్యూ

Vinaya Vidheya Rama Movie Public Talk,Vinaya Vidheya Rama Movie Review,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vinaya Vidheya Rama Telugu Movie Review,Vinaya Vidheya Rama Review,Latest Telugu Movie Review,Vinaya Vidheya Rama Movie Review and Rating,Vinaya Vidheya Rama Movie Story,Vinaya Vidheya Rama Movie Live Updates,Vinaya Vidheya Rama Movie Plus Points,Vinaya Vidheya Rama Movie Public Response,#VinayaVidheyaRamaReview
Vinaya Vidheya Rama Movie Review

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలకు రీచ్ అయిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
డైరెక్టర్: బోయపాటి శ్రీను
నిర్మాత: డీవీవీ దానయ్య
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు

కథ:

అనాధలైన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ రామ్ చరణ్ అన్నాదమ్ముల్లాగా కలిసుంటారు. నారందరిలో చిన్నవాడు రామ్ చరణ్ (రామ్). రామ్ అంటే ఆ నలుగురికి ఎంతిష్టమో.. రామ్ కు కూడా కుటుంబం అంటే అంత ప్రేమ ఉంటుంది. అలా అన్నయ్యలకి చిన్న ఆపద వచ్చినా..అవతలి వాళ్లు ఎంతటి వారైనా సరే లెక్క చేయకుండా ఎదురుతిరిగి ఢీ కొట్టి అన్నయ్యలకు తోడుంటాడు రామ్. ఇలా ఉండగా..

రామ్ పెద్దన్నయ్య భువన్ కుమార్(ప్రశాంత్) ఒక ఎలక్షన్ కమీషన్ ఆఫీసర్. చాలా సిన్సియర్ ఆఫీసర్. దాంతో భువన్ కుమార్ సిన్సియారిటీకి మెచ్చి బీహార్ లో జరిగే ఎలక్షన్స్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా అక్కడకు పంపిస్తారు. అక్కడకు వెళ్లిన ప్రశాంత్ ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) చేసే అరాచ‌కాల‌ను బ‌య‌ట పెడ‌తాడు. దీంతో బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌ని (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. రంగంలోకి దిగిన మున్నాభాయ్ రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఈ నేపథ్యంలో మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగిందా..? రామ్ ప్రశాంత్ ను ఈ ఆపద నుండి ఎలా కాపాడాడు..? ఈ కాపాడే క్రమంలో జరిగిన అనర్థాలేమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఒక హీరోను ఫుల్ మాస్ గా చూపించాలంటే మాత్రం అది ఒకే ఒక్క డైరెక్టర్ బోయపాటికే సాధ్యమన్న విషయం తెలిసిందే. భద్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన జయ జానకీ నాయక సినిమా వరకూ ఆయన కథల్లో హీరో కు ఉండే ఆ హీరోయిజమే వేరు. అలా ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ను అదే విధంగా చూపించాడు బోయపాటి. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా కనిపించే కుటుంబ బంధాలు, అనుబంధాల‌ే ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ు కూడా మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. కానీ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగా రాసుకుంటే బావుండేది. ఎందుకంటే.. పాత స్టోరీకే మళ్లీ కొత్త ముఖాలు పెట్టి సినిమా తీసిన ఫీలింగ్ కనిపిస్తుంటుంది.

ఇక గతంలో రామ్ మాస్ పాత్రలో నటించినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయడం ఇదే మొదటి సారి. తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో , పవర్ ఫుల్ యాక్షన్ తో రామ్ చరణ్ అదరగొట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా చరణ్ ఫిజిక్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో చాలా ఫిట్ గా కనిపిస్తాడు. సిక్స్ ప్యాక్ దానికితోడు ఒంటి పై టాటూ .. ఈ లుక్ కి అందరూ ఫిదా అవుతారు. పాటలు యావరేజ్ అయినప్పటికీ చరణ్ డాన్సులు ఇరగదీయడంతో స్క్రీన్ పై బాగా అనిపిస్తాయి. భరత్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన హీరోయిన్ కియారా అద్వానీ…ఈ సినిమాతో కూడా మంచి మార్కులే కొట్టేసింది. అందంతో పాటు అమాయకత్వం, అల్లరి కలగలిపిన పిల్ల పాత్రలో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ముఖ్యంగా చరణ్ కియార కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని చెప్పొచ్చు. డ్యాన్స్ ల్లో కూడా రామ్ చరణ్ కు ఎక్కడా తగ్గకుండా తన గ్రేస్ ను చూపించింది కియారా.

విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ రామ్ చరణ్ కు గట్టి పోటీనే ఇచ్చాడు. వివేక్ ఒబెరాయ్ పెర్ఫార్మన్స్ కూడా పోటా పోటీగా ఉండటంతో రామ్ చరణ్ – వివేక్ ఒబెరాయ్ మధ్య సీన్స్ బాగా హైలెట్ అవుతాయి. బాలీవుడ్ నుంచి వివేక్‌ను తీసుకొచ్చినందుకు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. కొన్ని స‌న్నివేశాల్లో వివేక్ ఒబెరాయ్ రామ్ చరణ్ ను తన నటనతో డామినేట్ చేసినట్టే కనిపిస్తోంది. ఇక అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, వదని పాత్రల్లో చేసిన స్నేహ, మధుమిత, హిమజ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ముఖ్యంగా ప్ర‌శాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలాన్ని ఇచ్చింది.

ప్లస్ పాయింట్స్:

* రామ్ చరణ్ నటన
* వివేక్ ఒబెరాయ్ విలనిజం
* బోయపాటి మాసిజం
* యాక్షన్స్ సీన్స్

మైనస్ పాయింట్స్:

* కథనం
* స్క్రీన్ ప్లే

ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని వర్గాలకు మెప్పింస్తుందని చెప్పలేం కానీ… మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమా అని చెప్పొచ్చు.

 

వినయ విధేయ రామ మూవీ రివ్యూ
  • story
  • Screenplay
  • Direction
  • Performance
4
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=DZ9GdjMHXFM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nineteen =