స‌్టూడెంట్ పాత్ర‌లో ప్ర‌భాస్‌?

Prabhas To Play Student Role in His Upcoming Film,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2019,Prabhas to Act Student Role in His Next Film,Actor Prabhas Play Student Role in His New Movie,Prabhas Upcoming Movie Updates,Prabhas To Play Student Character in His Next Movie,Prabhas Will be Playing the Role of a Student
Prabhas To Play Student Role In His Upcoming Film

`బాహుబ‌లి` స్టార్ ప్ర‌భాస్‌… ప్ర‌స్తుతం రెండు త్రిభాషా చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగ‌స్టు 15న తెర‌పైకి రానుండ‌గా… `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించిన పిరియాడిక్ ల‌వ్ స్టోరీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే… `జిల్‌` రాధాకృష్ణ చిత్రంలో ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే… ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో స్టూడెంట్‌గా సంద‌డి చేయ‌నున్నాడ‌ట ఈ యంగ్ రెబ‌ల్ స్టార్‌. క‌థలో భాగంగా వ‌చ్చే ఈ స‌న్నివేశాలు అభిమానుల‌ను ఎంతగానో ఎంట‌ర్‌టైన్ చేస్తాయ‌ని టాక్‌. అంతేకాదు… ఈ సినిమాలో వింటేజ్ కార్ ల‌వ‌ర్‌గానూ ఆయ‌న పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు. కాగా… ఇప్ప‌టికే క్లైమాక్స్ ఎపిసోడ్స్ తాలూకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి `జాన్‌` అనే పేరు పరిశీలనలో ఉందంట. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=xKvCdFBKr-Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =