రామ్ చ‌రణ్ ‘నాయ‌క్‌’కు ఆరేళ్ళు

6 Years Completed For Naayak Movie, 6 Years For Ram Charan Naayak Movie, Latest Telugu Movies 2019, Naayak Movie Latest News, Ram Charan Naayak Movie Completed For 6 Years, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
6 Years For Ram Charan Naayak Movie

యాక్ష‌న్ చిత్రాల‌కు త‌న మార్కు వినోదాన్ని జోడిస్తూ… తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన‌ ద‌ర్శ‌కుల‌లో వి.వి.వినాయ‌క్ ఒక‌రు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన ‘నాయ‌క్’ కూడా ఇలానే యాక్ష‌న్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో రూపొంది ఆక‌ట్టుకుంది. చ‌ర‌ణ్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం పోషించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, అమ‌లా పాల్ క‌థానాయిక‌లుగా న‌టించారు. ప్ర‌దీప్ రావ‌త్‌, రాహుల్ దేవ్, బ్ర‌హ్మానందం, జయ‌ప్ర‌కాష్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, దేవ్ గిల్‌, సుధ‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించగా… అందాల భామ ఛార్మి ఐటెమ్ సాంగ్‌లో క‌నువిందు చేసింది. యువ సంగీత‌ సంచ‌ల‌నం ఎస్.ఎస్‌.థ‌మ‌న్ స్వ‌రాల‌ను స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లన్నీ మెగాభిమానుల‌ను ఉర్రూత‌లూగించాయి. ముఖ్యంగా ‘శుభ‌లేఖ రాసుకున్న’ (‘కొండ‌వీటి దొంగ‌’లో పాట‌కి రీమిక్స్‌), ‘హే నాయ‌క్’ పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. జ‌న‌వ‌రి 9, 2013న‌ విడుద‌లైన ఈ సినిమా… నేటితో 6 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`నాయ‌క్‌`… కొన్ని విశేషాలు

* మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చిన క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తొలి చిత్ర‌మిది. `చూడాల‌ని వుంది`తో చ‌ర‌ణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో ఘ‌న‌విజ‌యం అందుకోగా… అదే బాట‌లో చ‌ర‌ణ్ బాబాయ్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా `ఖుషి`తో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు.
* `మ‌గ‌ధీర‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది.
* సంక్రాంతి సీజ‌న్ లో విడుద‌లైన రామ్ చ‌ర‌ణ్ తొలి చిత్ర‌మిది. మ‌ళ్ళీ ఏడాది త‌రువాత ఇదే సీజ‌న్ లో `ఎవ‌డు`తో ప‌ల‌క‌రించాడు. ఈ రెండు సినిమాల‌తోనూ ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న చర‌ణ్‌… ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ నెల 11న‌ `విన‌య విధేయ రామ‌`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.
* రామ్ చ‌ర‌ణ్ తొలి సంక్రాంతి రిలీజ్‌ `నాయ‌క్‌`ని నిర్మించిన డీవీవీ దాన‌య్య‌… మ‌ళ్ళీ ఆరేళ్ళ గ్యాప్ త‌రువాత ఇప్పుడు అదే సీజ‌న్‌లో `విన‌య విధేయ రామ‌`ని విడుద‌ల చేస్తుండ‌డం విశేషం.

[subscribe]

[youtube_video videoid=4O7v5MuCXFs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =