సంక్రాంతికి పోటా పోటీ – ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు

Huge Number of Theaters Allotted For Sankranthi Movie Releases,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Theaters For Sankranthi Movies Releases,Movies Releasing in Sankranthi 2019,Theaters Allotted For Sankranthi 2019 Movie Releases,2019 Telugu Sankranthi Movies,Tollywood Films Releasing For Sankranthi
Huge Number of Theaters Allotted For Sankranthi Movie Releases

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో మొదలుకానున్న సంక్రాంతి సినీ పండుగ…ఎఫ్2 సినిమా వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజవుతుండగా.. జనవరి 10వ తేదీన పేటా.. జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12వ తేదీన ఎఫ్ 2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు.. అన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడంతో సినిమా లవర్స్ కు పండగే పండగ. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య ఒకటుంది. అదే థియేటర్ల కొరత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉన్నదే 1600 థియేటర్లు.. రోజు గ్యాప్ లో సినిమా రిలీజ్ అవుతుంది…ఈ నేపథ్యంలో థియేటర్ల కొరతతో ఏం చేయలేని స్థితిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 9వ తేదీన రిలీజవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకేముంది అక్కడికే థియేటర్లు అయిపోయాయి. ఆ వెంటనే 10వ తేదీన పేట. ఇక్కడ ఉన్న తెలుగు సినిమాలే థియేటర్ల కోసం కొట్టుకుంటుంటే…డబ్బింగ్ సినిమాకు ఏం థియేటర్లు ఇవ్వాలని ఇక్కడ నిర్మాతలు అంటున్నారు. దాంతో పేట సినిమా కేవలం 200 థియేటర్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఇక 11న రిలీజ్ అవుతున్న వినయ విథేయ రామ దాదాపు 800 థియేటర్లలో విడుదల కానుంది. రెండు రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను కొన్ని థియేటర్లలో తొలగించక తప్పదు. ఇక ఎఫ్ 2 సినిమా కూడా అంతే. దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ సమయానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలను కొన్ని థియేటర్ల నుంచి తొలగించక తప్పదు. ఇక అజిత్ సినిమాకు కూడా థియేటర్లు అంతంత మాత్రమే. మరి చూద్దాం ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా భవిష్యత్తు ఎలా ఉందో..?

[subscribe]

[youtube_video videoid=and6XZwInKM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =