ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బాలు`కి 14 ఏళ్ళు

14 Years For Pawan Kalyan Balu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balu Movie Updates,Balu Telugu Movie Latest News,Balu Movie Completed 14 Years,Powerstar Pawan Kalyan Balu Movie Latest News
14 Years For Pawan Kalyan Balu Movie

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘తొలిప్రేమ‌’. 1998లో విడుదలైన ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు `ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్` ఎ.కరుణాకరన్. దాదాపు ఏడేళ్ళ‌ విరామం త‌రువాత‌… ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న మ‌రో మ్యూజిక‌ల్ హిట్ `బాలు`. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమాలో ప‌వ‌న్‌కి జోడీగా శ్రియ, నేహా ఒబెరాయ్‌ న‌టించ‌గా… జ‌య‌సుధ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, సునీల్, బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ గ్రోవ‌ర్ తదిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో కనిపించారు.

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లన్నీ శ్రోత‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీలో జ‌రిగే తంతు’, ‘అతి మెత్త‌ని’, ‘లోకాలే గెల‌వ‌గ’, ‘ఇంతే ఇంతింతే’, `క‌న్ను కొట్టినా` పాటలు ఆ రోజుల్లో సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ సినిమాలో ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌తో పాటు… యాక్ష‌న్, కామెడీ, భావోద్వేగ స‌న్నివేశాల‌ను కూడా ఎంతో చ‌క్క‌గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు కరుణాక‌ర‌న్‌. త‌న గ‌త చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని కూడా ఎంతో రిచ్‌గా నిర్మించి… ప్రేక్షకులకి ఓ విజువల్ ట్రీట్‌ను అందించారు అశ్వ‌నీద‌త్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈ సినిమా కెరీర్‌లో 11వ చిత్రం కాగా… హీరోయిన్ శ్రియకి కూడా తెలుగులో ఇది 11వ చిత్రం కావడం. 2005 జ‌న‌వ‌రి 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన `బాలు`… నేటితో 14 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here