`ఎఫ్ 2`లో ఆ రెండింటికి స్కోప్ ఉంద‌ట‌

F2 To Have Both Comedy And Sentiment Scenes,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Have Both Comedy And Sentiment Scenes,F2 Movie Latest News,F2 Telugu Movie Have Both Comedy and Sentiment Scenes,Fun and Frustration Movie Updates
F2 To Have Both Comedy And Sentiment Scenes

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `F2`. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాని హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌గా…. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఈ నెల 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే… ఫ్యామిలీ డ్రామాగా… ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమాలో కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ హాస్యానికే పెద్ద పీట వేసిన‌ప్ప‌టికీ… ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌కు కూడా స్కోప్‌ ఉంటుంద‌ట‌. ముఖ్యంగా… సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్‌గా అనిపిస్తాయ‌ట‌. ఈ ఫ‌న్‌, ఎమోష‌న్స్ తాలూకు స‌న్నివేశాల్లో వెంకీ ఎప్ప‌ట్లాగే త‌న స‌హ‌జ న‌ట‌న‌తో సినిమాని నెక్ట్స్ లెవ‌ల్ తీసుకువెళితే… వ‌రుణ్ తేజ్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ రోల్‌లో కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ సీక్వెన్స్‌లోనూ `కెరీర్‌ బెస్ట్‌` పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని స‌మాచారం. మ‌రి… ఈ తోడ‌ల్లుళ్ళ వినోదాన్ని, భావోద్వేగాల‌ను చూడాలంటే… మ‌రో వారం రోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

[subscribe]

[youtube_video videoid=GiKB2ZJlOlE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =