`మెర్సల్` (అదిరింది), `సర్కార్` చిత్రాలతో రెండు వరుస ఘనవిజయాలను అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్… ప్రస్తుతం `రాజా రాణి` ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `తెరి`(పోలీస్), `మెర్సల్` తరువాత విజయ్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో… తమిళనాట ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. నయనతార ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ విమెన్స్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నాడట. ఆ టీమ్ ప్లేయర్స్‌గా 16 మంది యువ కథానాయికలు నటిస్తుండగా… విజయ్‌కి జోడీగా నయన్‌తో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుందట. సో… అలా విజయ్ చిత్రంలో మొత్తం 18 మంది కథానాయికలు సందడి చేయబోతున్నారన్నమాట. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రం అనువాదం కానుంది.
[youtube_video videoid=RUApuV5QzYk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: