అప్పుడు `భాగ‌మ‌తి`… ఇప్పుడు `మిస్ట‌ర్ మ‌జ్ను`

SS Thaman Latest Updates,Will Thaman Sentiment Work For Akhil Mr Majnu,SS Thaman,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Music Director Thaman Latest Movies,Akhil Mr Majnu Movie Latest News,SS Thaman Sentiment Work For Akhil Mr Majnu,Music director Thaman Sentiment Work For Akhil Mr Majnu,Mr Majnu Movie Music Director Latest Updates
Will Thaman Sentiment Work For Akhil Mr Majnu

ఈ ఏడాది యువ సంగీత సంచ‌ల‌నం థమ‌న్‌కు ఎంతో స్పెష‌ల్‌. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లో భాగ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా… స్వ‌ర‌క‌ర్త‌గా అటు ప్రేక్ష‌కుల నుంచి, ఇటు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందాడు. `భాగ‌మ‌తి`, `తొలిప్రేమ‌`, `అర‌వింద స‌మేత‌`తో సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రో మెట్టు ఎదిగాడు. అంతేకాదు… `అర‌వింద స‌మేత‌`తో వంద చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు. సంఖ్యా ప‌రంగానూ ఈ సంవ‌త్స‌రం థమ‌న్‌కి ఘ‌నంగా ఉంద‌నే చెప్పాలి. వ‌చ్చే ఏడాది ఆరంభంలో… ఇదే జోష్‌తో ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సంద‌డి చేయ‌నున్నాడు థమన్. ఆ చిత్ర‌మే… అక్కినేని అఖిల్ హీరోగా న‌టిస్తున్న `Mr. మ‌జ్ను`. `తొలిప్రేమ‌` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ సినిమా రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న తెర‌పైకి రానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… థమ‌న్ త‌న నేప‌థ్య సంగీతంతో నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకువెళ్ళిన థ్రిల్ల‌ర్ మూవీ `భాగ‌మ‌తి`కూడా ఈ ఏడాది రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగానే తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి… ఈ సెంటిమెంట్ `Mr. మ‌జ్ను`కి కూడా వ‌ర్తించి… థమ‌న్ ఖాతాలో మ‌రో విజ‌యం జ‌మ అవుతుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here