క్యూ క‌డుతున్న దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రాలు

Devi Sri Prasad Turns Busy With His Latest Projects,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Devi Sri Prasad Busy With His Upcoming Projects,Devi Sri Prasad New Movies Latest Updates,Music director Devi Sri Prasad Next Movies
Devi Sri Prasad Turns Busy With His Latest Projects

స్వ‌ర‌క‌ర్త‌గా దేవిశ్రీ ప్ర‌సాద్ ది 19 ఏళ్ళ ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో ఎన్నో మ్యూజిక‌ల్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ ఖాతాలో మూడు మ్యూజిక‌ల్ హిట్స్ చేరాయి. ఆ చిత్రాలే… `రంగ‌స్థ‌లం`, `భ‌ర‌త్ అనే నేను`, `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. తెలుగులో ఈ సంవ‌త్స‌రం దేవిశ్రీ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో వ‌చ్చిన ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌లుగా నిల‌చాయి. ఇదిలా ఉంటే… వ‌చ్చే ఏడాది దేవిశ్రీ ప్ర‌సాద్ సంద‌డి మాములుగా ఉండ‌డంలేదు. అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు తెర‌పైకి రాబోతున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న `విన‌య విధేయ రామ‌`… విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`తో సంక్రాంతికి మొద‌ల‌య్యే డీఎస్పీ సినిమాల సంద‌డి… ఆ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి -కొర‌టాల కాంబో మూవీ, వెంక‌టేష్, నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ `వెంకీ మామ‌`, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`… అలాగే మ‌హేష్ – సుకుమార్ చిత్రం, సాయిధ‌ర‌మ్ తేజ్ `చిత్ర‌ల‌హ‌రి`, నితిన్ `భీష్మ‌`… ఇలా వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో సాగ‌నుంది. మొత్త‌మ్మీద‌… 2019లోనూ దేవిశ్రీ ప్ర‌సాద్ హ‌వా కంటిన్యూ కానుంద‌న్న‌మాట‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here