త‌న తండ్రికి అమ్మ అవుతున్న స‌మంత‌

Samantha To Play A Different Role,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Samantha Latest Movies Updates,Samantha To Play a Different Character,Samantha Upcoming Movies Details,Samantha Akkineni Different Role in Her New Movie
Samantha To Play A Different Role

`సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `అత్తారింటికి దారేది`, `రాజు గారి గ‌ది 2`… స‌మంత హీరోయిన్‌గా న‌టించిన ఈ మూడు చిత్రాల‌కూ ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే… ఈ మూడు సినిమాల్లోనూ సామ్‌కి తండ్రిగా విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ న‌టించాడు. క‌ట్ చేస్తే… ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యి… స‌మంత‌కి కొడుకుగా మారుతున్నాడ‌ట ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే… సామ్ ప్ర‌స్తుతం కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి `ఓ బేబి ఎంత స‌క్క‌గున్నావే` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా కోసం క‌థానుసారం రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది సామ్‌. 20 ఏళ్ళ ప‌డుచుపిల్ల‌గా త‌న‌ని తాను చూడాల‌నుకునే 70 ఏళ్ళ బామ్మ‌కి… అనూహ్యంగా ఆ కోరిక నెర‌వేరితే ఏమ‌వుతుంద‌నే అనే అంశంతో `మిస్ గ్రానీ` తెర‌కెక్కుతుండ‌గా… 20 ఏళ్ళ భామ‌గానూ, 70 ఏళ్ళ బామ్మ‌గానూ సామ్ సంద‌డి చేయ‌నుంద‌ట‌. ఈ నేప‌థ్యంలో… ఆ బామ్మ‌కి కొడుకుగా 50 ఏళ్ళ వ్య‌క్తి పాత్ర‌లో రావు ర‌మేష్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలా… స‌మంత‌కి కొడుకుగా రావు ర‌మేష్ ట‌ర్న్ అవుతున్నాడ‌న్న‌మాట‌. మ‌రి… ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే… వేస‌వి వర‌కు వేచిచూడాల్సిందే.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here