టాక్సీవాలా ప్రొడ్యూసర్ సక్సెస్ జర్నీ- ఫ్యాన్ గా స్టార్ట్ చేశా, ఇప్పుడు నిర్మాతగా కలిశా

Success Story of Taxiwaala Producer SKN,A Remarkable Journey of a Fan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Successful Journey of SKN,Producer SKN Latest News,Producer SKN Film Journey News,A Successful Journey of a Fan,Successful Journey of Film Producer SKN
Success Story of Taxiwaala Producer SKN

ఒక అభిమానిగా జర్నీ స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఆయనను కలిసే స్థాయికి ఎదిగాను అని చెబుతున్నాడు టాక్సీవాలా ప్రొడ్యూసర్ ఎస్.కేఎన్. ఇంతకీ ఆయన అభిమానించే హీరో ఎవరో తెలుసు కదా..ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం ఆయన చాలా సందర్భాలలోనే చెప్పాడు. మూవీ జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉండే స్థాయికి ఎదిగిన ఆయన తన కేరీర్ ఎలా స్టార్ట్ అయిందే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఏలూరులో డిగ్రీ పూర్తిచేసిన నాకు చిరంజీవిగారంటే అంటే పిచ్చి అభిమానం..ఆయనకు పెద్ద ఫ్యాన్ ని.. చిరంజీవి గారి సినిమాలు ఏమొచ్చినా..ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్ నుండి కలెక్ట్ చేసుకునేవాడిని..చిరంజీవి గారి ఫ్యాన్ పేజ్ ఫస్ట్ క్రియేట్ చేసింది కూడా నేనే..నేను నమ్మలేకపోయాను..ఫస్ట్ క్రియేట్ చేసిందే నేనే అని చెప్పారు. అది చూసి ఎంతో మంది అభిమానులు నాకు ఫోన్ చేశారు..అంతేకాదు యూస్ లో ఉండే ఎన్ఆర్ఐ కుమార్ అనే చిరంజీవి ఫ్యాన్ నాకు ఫోన్ చేసి..నాకు ఇంటి నుండే పనిచేసేలా ఒక కంప్యూటర్ పంపించారు.. దానితో పాటు అల్లు శిరిష్ ఈ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారన్నాడు.

ఆ తరువాత ఉదయాన్నే రివ్యూలు పెట్టడం..ఈ లోపు అల్లు శిరిష్ తో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం.. ఆతరువాత ఫ్రెండ్స్ అవ్వడం.. దాని తరువాత ఇంద్ర 100 రోజుల ఫంక్షన్ లో అల్లు అర్జున్ ను కలవడం జరిగాయి. అక్కడ అల్లు అర్జున్ నన్ను హైదరాబాద్ వచ్చేయమన్నారు..అప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను..అక్కడ ఓ తెలుగు ఛానల్ లో ఫిలిం రిపోర్టర్ గా జాయిన్ అయ్యా అలా మొదలై ఇక్కడి వరకూ వచ్చిందన్నారు.

అలా కెరీర్ స్టార్ చేసిన ఎస్.కే.ఎన్ మారుతి డైరెక్షన్ లో వచ్చిన స్మాల్ బడ్జెట్ మూవీ ఈరోజుల్లో సినిమాకు నిర్మాతగా వ్యవహించాడు. ఆతరువాత.. భలే భలే మగాడివోయ్..మహానుభావుడు సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించానని తెలిపాడు. ఇప్పుడు టాక్సీవాలా సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా వ్యవహరించానని.. టాక్సీవాలా మంచి సక్సెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. నేను మెగా ఫ్యాన్‌గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను… ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నా దేవుడు చిరంజీవిని కలుసుకొన్నాను అంటూ భావోద్వేగమయ్యాడు. అంతేకాదు.. ఫైనల్ గా అభిమానులంటే ఏదో వారిని అభిమానిస్తూ తిరిగేవాళ్లు మాత్రమే కాదని..తాము అభిమానించే హీరోల నుండి స్ఫూర్తిని తీసుకొని సక్సెస్ లు సాధిస్తారని చూపెట్టాలని నేను అనుకున్నా అదే చేశా అని తెలిపారు. మొత్తానికి చిరంజీవి అభిమానిగా ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన దగ్గర నుండి స్టార్ట్ అయిన జర్నీ…ఆయన్ని కలవడంతో ఎస్.కే.ఎన్ జర్నీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

కాగా విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యన్‌ దర్శకత్వంలో ఎస్‌.కే.ఎన్‌ నిర్మించిన ఈసినిమా మంచి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పైరసీ బారిన పడినా కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here