యాత్ర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Yatra Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Yatra Movie Teaser Release Date Fixed,Yatra Movie Teaser Release Date Revealed,Yatra Movie Teaser Release Date Confirmed,Yatra Movie Teaser Release Date Announced,Yatra Movie Gets a Teaser Release Date,Yatra Movie Latest Updates
Yatra Movie Teaser Release Date Locked

‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వై.ఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ సినిమాలో వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇప్పుడు తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 8 గంటలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక డిసెంబర్ 21 రాజశేఖర్ తనయుడు జగన్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

కాగా ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, అనసూయ, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీకి కృష్ణ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా… విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here