ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్, ఆడియో లాంచ్ కు మారిన వేదిక

NTR Biopic Audio and Trailer Launch Venue Changed,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,NTR Biopic Audio and Trailer Launch On 21st December,NTR Biopic Trailer and Audio Launch Updates,NTR Biopic Audio and Trailer Launch Venue PostPoned,NTR Biopic Audio and Trailer Launch Latest News,NTR Biopic Trailer and Audio Event Changed,#NTR Biopic
NTR Biopic Audio and Trailer Launch Venue Changed

క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు గారి బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ జరుపుతున్నారు. ఈలోపు ఈ సినిమాలో నటిస్తున్న పలువురి యంగ్ హీరో హీరోయిన్ల లుక్స్ ను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.

అయితే ఈ సినిమా ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్స్ ను గతంలో ఫిక్స్ చేసి మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ట్రైలర్, ఆడియో రెండూ ఒకేరోజు డిసెంబర్ 21వ తేదీన.. నందమూరి తారకరామారావు స్వస్థలం నిమ్మకూరులో లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు నిమ్మకూరులో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఏపీ పెథాయ్ తుఫాన్ తో అతలాకుతలమవుతోంది. ఈ కారణంగా.. అక్కడ ఈ కార్యక్రాన్ని అక్కడ రద్దు చేసి ఇక్కడ హైదరాబాద్, ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో అదే రోజు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మరోసారి పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్రయూనిట్ సభ్యులు.

 

 

కాగా ఎన్ బి కె ఫిలిమ్స్, విబ్రి మీడియా, వారాహి చలన చిత్ర బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాను..ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కధానాయకుడు పార్ట్ లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు. ఈ పార్ట్ ను జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పార్ట్ ను జనవరి 24న రిలీజ్ చేయనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here