మణికర్ణిక ట్రైలర్ రిలీజ్

Manikarnika Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2018,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Manikarnika Trailer,Manikarnika Movie Trailer,Manikarnika Telugu Movie Trailer,#ManikarnikaTrailer,Manikarnika Theatrical Trailer,Manikarnika Movie Official Trailer,Manikarnika Movie Latest News
Manikarnika Movie Trailer Out Now

ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణిక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదట ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తరువాత క్రిష్ తప్పుకోవడంతో.. మిగిలిన షూటింగ్ ను కంగనానే పూర్తిచేసింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 25వ తేదిన రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకే రోజు ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇక ఏ సినిమాకు రాని వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. మొదట ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడంటూ, ఆ తరువాత సోనూ సూద్.. ఆతరువాత మరో నటి ఇలా ఒకదాని తరువాత ఒకటి వివాదలతోనే సగం సినిమాకు క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. మరి ఈ అంచనాలను మణికర్ణిక ఎంతవరకూ రీచ్ అవుతుందో? చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here