హుషారెత్తిస్తున్న హుషారు – పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటున్న హుషారు

Hushaaru Receiving Rave Reviews From the Audience,Telugu Filmnagar,Latest Telugu Movies 2018,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Hushaaru Telugu Movie Response From Audience,Hushaaru Movie Audience Response,Hushaaru Movie Latest News,Hushaaru Movie Public Talk,#Hushaaru,Hushaaru Review From Public,Hushaaru Movie Public Response,Audience About Hushaaru Movie
Hushaaru Receiving Rave Reviews From the Audience

యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ ఎప్పడూ ఉంటుందని మరోసారి నిరూపించారు. సినిమా చూసే ప్రేక్షకుల మైండ్ కూడా మారిపోయింది. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూసే రోజులు పోయాయి.. సినిమాలో కంటెంట్ ఉందా? లేదా? అని మాత్రమే చూస్తున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు అన్న డైలాగ్ లాగా.. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా అయినా సరే పెద్ది హిట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఎన్నో చిన్న సినిమాల ఘనవిజయాలే దీనికి నిదర్శనం.

అలా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిన్న సినిమా హుషారు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం హుషారు…ఈ నెల 14వ తేదీన విడుదలై..యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా యూత్ కి బాగా నచ్చేసింది. రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. మొదట రిలీజైంది కొన్ని థియేటర్లలో మాత్రమే అయినా..ఆ తరువాత ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్.. రివ్యూవల్ల రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. గతంలో ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ కలబోసి వచ్చిన ప్రేమదేశం, హ్యాపీ డేస్ లాంటి సినిమాలు భారీ సక్సెస్‌లను అందుకొన్నాయి. ఇప్పుడు అలాంటి అంశాలతోనే వచ్చిన హుషారు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించడం హర్షించతగ్గ విషయమే. ఇక ఈ సినిమాను చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమా విజయం పై స్పందించి చిత్రయూనిట్ కు అభినందనలు తెలుపుతున్నారు.  అంతేకాదు…మిగిలిన సినిమాల కంటే ఈ సినిమానే ఎక్కువ శాతం థియేటర్లను సొంత చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్లను రాబడుతుంది.

 

 

 

 

 

 

 

నిజానికి పెళ్లి చూపులు ఘన విజయం తరువాత చిన్న సినిమాలకు కాస్త ప్రాణం వచ్చినట్టైంది. అంతేకాదు… ఆసినిమా తరువాత కాస్త కొత్త కథలు రాయాలన్న ఆలోచనలో పడ్డారు. ఎంతో మంది కొత్త దర్శకులు..కొత్త నటీ నటులు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మరి ఇలానే ఎన్నో చిన్న చిన్న సినిమాలు రావాలని..కొత్త కొత్త నటీ నటులు తెలుగు తెరకు పరిచయమవ్వాలని..కోరుకుందాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here