`ఎఫ్ 2`తోనూ కొన‌సాగుతుందా?

F2 Follows Dil Raju Sankranthi Sentiment,Telugu Filmnagar,Latest Telugu Movies 2018,Telugu Film News 2018,Tollywood Cinema Updates,F2 Movie Latest News,Fun and Frustration Movie Latest Updates,Venkatesh and Varun Tej Movie F2 Follows Dil Raju Sentiment,#F2
F2 Follows Dil Raju Sankranthi Sentiment

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను నిర్మించ‌డంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు శైలే వేరు. ఈ త‌ర‌హా చిత్రాల‌తో ఎన్నో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న రాజు… మ‌రో కుటుంబ క‌థా చిత్రంతో రాబోతున్నారు. అదే `ఎఫ్ 2`. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాని సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన దిల్ రాజు చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` (2013), `ఎవ‌డు` (2014), `శ‌తమానం భ‌వ‌తి` (2017) చిత్రాలు సంక్రాంతి పండ‌క్కి సంబ‌రాలు అందించాయి. ఈ నేప‌థ్యంలో… `ఎఫ్ 2` కూడా అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని అందుకుంటుందేమో చూడాలి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూస్తే… ఈ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌క్కా బాక్సాఫీస్ విన్న‌ర్ అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు `ఎఫ్ 2` టీమ్!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here