అక్క‌డ ర‌జ‌ని ఇక్క‌డ‌ నాని

Anirudh Ravichander Back to Back Movies With Nani, Anirudh Ravichander Music For Jersey Movie, Anirudh Ravichander Music For Nani New Movie Jersey, Anirudh Ravichander Music For Natural star Nani Jersey Movie, Anirudh Ravichander to Compose Music For Jersey Movie, Latest Telugu Moviews News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Anirudh Ravichander Back to Back Movies With Nani

‘3’ సినిమాతో కోలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ ర‌విచంద‌ర్‌. దాదాపు కోలీవుడ్ స్టార్ హీరోలంద‌రి సినిమాల‌కు సంగీతం అందించారు ఈ యువ సంచ‌ల‌నం. తాజాగా సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ న‌టించిన ‘పేట్ట’ మూవీకి కూడా సంగీతం అందించి… త‌న స్థాయిని మ‌రింత పెంచుకున్నారు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న ఈ మూవీలోని పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నార్కాలి’ (అంటే… త‌మిళంలో కుర్చీ)అనే మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి కూడా అనిరుధ్‌ సంగీత సారథ్యం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే… రజనీతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయ‌బోతున్న‌ట్లే… టాలీవుడ్‌లో కూడా ఓ హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంద‌డి చేయబోతున్నారట‌ అనిరుధ్‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఈ ఏడాది ఆరంభంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ‘అజ్ఞాత‌వాసి’ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు అనిరుధ్‌. ఈ సినిమాలోని పాట‌ల‌తో టాలీవుడ్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌… ప్ర‌స్తుతం నాని హీరోగా ‘మ‌ళ్ళీరావా’ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘జెర్సీ’ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. మ‌రోవైపు… నాని, విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న‌ సినిమాకు కూడా అనిరుధ్‌ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నారని వినికిడి. మొత్త‌మ్మీద అటు కోలీవుడ్‌లో ర‌జనీకి, ఇటు టాలీవుడ్‌లో నానికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి ప‌నిచేసే అవ‌కాశం అనిరుధ్‌కి ద‌క్క‌నుంద‌న్న మాట. త్వ‌ర‌లోనే ఈ సినిమాల‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here