సీరియస్ అయినా కామెడీ అయినా – ఎక్కడా తగ్గని మన హీరోలు

Actors Who Slayed Both Comedy and Action Roless,12 Actors Who Can Nail it at Comedy & Action,Latest Telugu Movies 2018,Telugu Actors Who Can Do Both Comedy & Action Roles,Telugu Film Actors who can Do Both Comedy Role and Action Role,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Actors who Nail it at Comedy & Action,Tollywood Cinema Latest News,Tollywood Stars Who Played Comedy Role and Action Roles
Actors Who Slayed Both Comedy and Action Roles

కామెడీ అయినా..సీరియస్ అయినా, ఎమోషన్ అయినా..ఏదైనా ఏ రసమైనా పండించేవాడే అసలైన నటుడు. నవరసాల్లో అన్ని రసాలు పండించలేకపోయినా..వాటిలో కొన్ని రసాలైనా పండించే టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికీ. అలా మన హీరోలు కూడా ఎంత సీరియస్ పాత్రలు పోషించినా… కామెడీ పాత్రలు కూడా అదే రేంజ్ లో చేసి కడుపుబ్బా నవ్వించిన వాళ్లున్నారు. మరి అటు సీరియస్ పాత్రల్లో..ఇటు కామెడీ పాత్రల్లో తమ సత్తా చాటిన మన హీరోల గురించి ఒకసారి తెలుసుకుందాం.

చిరంజీవి

 

స్వయంకృషితో సినిమా రంగంలో అడుగుపెట్టి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి తరువాత ఆ నెంబర్ వన్ స్థానాన్ని ఇప్పటివరకూ ఎవరు చేరుకోలేకపోయారంటేనే చెప్పొచ్చు. తెలుగు వెండి తెరపై ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రారాజే. సుప్రీమ్ హీరోగా మొదలై.. మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఈ తరం నటులకు ఆదర్శం. ఇక చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ నటన వల్లే ఆయన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. తెలుగు సినిమాకు రికార్డులు అంటే ఎలా ఉంటాయో చూపించిన మెగా మ‌గ‌ధీరుడు చిరంజీవి. చిరు కూడా ఎంత సీరియస్ పాత్రలు చేయగలడో..అదే రేంజ్ లో నవ్వులు కూడా పూయించగలడు. ఉదాహరణకు ఇంద్ర సినిమాలో ఎంత సీరియస్ గా నటించాడో..అదే చిరూ..శంకర్ దాదా ఎం.బి.బిఎస్ సినిమాలో చేసిన కామెడీ పీక్స్ అని చెప్పొచ్చు.

వెంకటేష్

 

శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమయి.. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదట తన సినిమాలతో యువతను ఆకర్షించిన వెంకీ.. బొబ్బిలిరాజ తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేమించుకుందాం..రా..!, పెళ్ళిచేసుకుందాం, కలిసుందాం..రా..! వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం గెలుచుకుని తెలుగు సినిమా మూడో తరం టాప్ నలుగురు హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇక వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పలేం. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. అలా అని సీరియస్ పాత్రలు చేయడనుకుంటే పప్పులో కాలేసినట్టే. గురు సినిమాలో వెంకీ చేసిన నటన సినిమాకే హైలైట్. ఒక్క గురు సినిమా అనే కాదు.. చాలా సినిమాల్లో వెంకీ సీరియస్ పాత్రలు చేశాడు. సీరియస్ పాత్రలు ఎలాగైతే చేయగలడో.. కామెడీ కూడా అదే రేంజ్ లో చేయగలిగిన నటుడు.

నాగార్జున

 

ఇప్పటీకి టాలీవుడ్ మన్మధుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు నాగార్జున. వయసు పెరిగేకొద్ది..తన ఏజ్ తగ్గిపోతుందేమో అన్నంత యంగ్ గా తయారవుతున్నాడు నాగార్జున. ఏఎన్నార్ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నాగార్జున..ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ టాప్ నలుగిరి హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఇక నాగార్జున నటన గురించి చెప్పాలంటే.. తన కెరీర్ బ్రేక్ సినిమా శివతో మొదలుపెట్టాల్సిందే. ట్రెండ్ సెట్ గా నిలిచిన సినిమా. సీరియస్ లుక్ తో శివ సినిమాలో నాగార్జున చేసిన యాక్షన్ పీక్స్. అదే నాగార్జునను మన్మధుడిగా తీర్చిన సినిమా మన్మథుడు. ఇక ఈసినిమాలో నాగార్జున అమ్మాయిలంటే పడని క్యారెక్టర్ లో చేసిన కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడు చూసినా బోర్ కొట్టని నాగార్జున రోల్స్ లో మన్మథుడు సినిమాలో రోల్ కూడా ఒకటని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చిరంజీవి తరువాత వచ్చిన తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ టాప్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్..ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత వచ్చిన తొలిప్రేమ.. బద్రి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. ఆ తరువాత వచ్చిన ఖుషి సినిమా గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా తన సినీ కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక తన నటన విషయానికొస్తే…తాను ఏపాత్ర అయినా చేయగలనని కెరీర్ బిగినింగ్ లోనే నిరూపించాడు. ఉదాహరణకు పంజా సినిమాలో ఎంత సీరియస్ గా నటించాడో..జల్సా సినిమాలో అదే రేంజ్ లో నవ్వించాడు పవన్.

మహేష్ బాబు

 

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే ఏ ఆన్సర్ వస్తుంది. తెలిసిందే కదా..సూపర్ స్టార్ మహేష్ బాబు అని. చిన్నప్పటినుండే సినిమాలు చేస్తు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు చేసిన సినిమాలు… నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి ఖలేజా సినిమా వరకూ మహేష్ లో అంత కామెడీ యాంగిల్ ఒకటుందని ఎవరికీ తెలియదు. ఖలేజా సినిమాతో మహేష్ లో ఆ కామెడీ ఈ యాంగిల్ ను చూసి ఆశ్చర్యపోయిన వాళ్లున్నారు. అంతలా ఆ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో నవ్వించేశాడు మహేష్. ఆ సినిమాలో మహేష్ తప్ప మరొకరు కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఇక సీరియస్ పాత్రల గురించి చెప్పాలంటే మహేష్ కెరీర్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇటీవల వచ్చిన భరత్ అనే నేను సినిమానే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. యంగ్ సీఎంగా.. సీరియస్ పాత్రలో మహేష్ చేసిన నటన.. డైలాగ్స్ సూపర్బ్. అందుకే సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్

 

నందమూరితారక రామారావు మనవడిగా.. టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తారక్..ఆ తరువాత తన సినీ కెరీర్ లో పలు సినిమాల్లో నటిస్తూ..మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న హీరోల్లో ఓ రకంగా చెప్పాలంటే డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ ను కొట్టిన హీరో లేడని చెప్పొచ్చు. అంత స్పష్టంగా డైలాగ్స్ చెప్పడమే కాదు.. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒకే టేక్ లో చెప్పగలిగే సత్తా ఉన్న నటుడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి చెప్పడం అంటే అది హాస్యాస్పదమే అవుతుంది. ఏ రోల్ అయినా సరే అలవోకగా చేసేస్తాడు. సీరియస్ రోల్స్ లో ఎంత సీరియస్ గా నటించాలో..కామెడీ రోల్స్ లో అంత కామెడీగా నటిస్తాడు.. వీటికి ఉదాహరణ..అదుర్స్ సినిమాలో బ్రహ్మణునిగా ఎన్టీఆర్ చేసిన కామెడీ మాములుగా ఉండదు. అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో టోటల్ డిఫరెంట్. సీరియస్ లుక్ లో చాలా సెటిల్డ్ గా నటించాడు.

ప్రభాస్

 

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో అందరూ డార్లింగ్ అని పిలుచుకునే హీరో ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ గా ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గుడుపుతున్నాడు. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఆరడుగుల ఆజానుబాహువుడు..ఆ తరువాత రాఘవేంద్ర, వర్షం, ఛత్రపతి సినిమాలతో మంచి పేరును తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో దాదాపు అన్నీ సీరియస్ రోల్స్ లో కనిపించిన ప్రభాస్.. బుజ్జిగాడు సినిమాతో తనలోని అసలైన కామెడీని చూపించాడు. అసలు ఛత్రపతి సినిమాలో ఉన్న ప్రభాస్ కు.. బుజ్జిగాడు సినిమాలో ఉన్న ప్రభాస్ కు పోలికే ఉండనంత చేంజ్ ఓవర్ కనిపిస్తుంది.

రవితేజ

 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా…కష్టపడి పైకి వచ్చిన నటుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. తన మాస్ డైలాగ్స్ తో …ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక కామెడీ చేయడంలో రవితేజ స్టైలే వేరు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా నవ్వించగలిగే సత్తా ఉన్న నటుడు రవితేజ. మరి అలాంటి రవితేజ సీరియస్ పాత్రలు చేయగలడా అంటే.. చేయగలడనే నిరూపించాడు నేనింతే సినిమాతో. ఎలాంటి హడావుడి లేకుండా రవితేజ చాలా కూల్ అండ్ కామ్ గా నటించాడు ఆ సినిమాలో.

అల్లు అర్జున్

 

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అల్లు అర్జున్. ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తన డ్యాన్స్ తో, నటనతో ఇప్పుడు టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకొని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక అల్లు అర్జున్ నటన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఎనర్జిటిక్ హీరోగా నటించే బన్నీ సెటిల్డ్ క్యారెక్టర్ లో నటిస్తాడా అన్న అనుమానాలు ఉండేవి. అలాంటి అనుమానాలు బ్రేక్ వేశాడు నా పేరు సూర్య సినిమాతో. ఎనర్జిటిక్ రోల్స్ కామెడీతో ఎంతలా నవ్వించగలడో…నా పేరు సూర్య సినిమాలో సీరియస్ క్యారెక్టర్ లో కూడా అంత బాగా ఫెర్మామెన్స్ చేసి అందర్నీ మెప్పించాడు.

నాని

 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న హీరో నాని. అందుకే నాని అంటే అభిమానించే వాళ్లు చాలా మంది ఉంటారు. తన సహజమైన నటనతో న్యాచురల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ అష్టా చమ్మా లాంటి సినిమాతో హిట్ కొట్టి ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక నాని నటన గురించి చెప్పాలంటే..చాలా న్యాచురల్ గా నటించే హీరో నాని. పిల్ల జమిందార్ సినిమాలో కామెడీతో.. ఎలా నవ్వించాడో..అలాగే తను సీరియస్ క్యారెక్టర్ లో నటించగలనని జెంటిల్ మెన్ సినిమాతో నిరూపించాడు నాని.

రామ్ పోతినేని

 

దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఫుల్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్. దేవదాస్ సినిమాతోనే హిట్ కొట్టి ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. తన డ్యాన్స్, యాక్టింగ్, డెడికేషన్ వీటన్నింటినీ చూస్తేనే తెలుస్తోంది రామ్ కు సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్. ఏ రోల్ అయినా ఎంతో ఎనర్జిటిక్ గా పెర్ఫామెన్స్ చేస్తూ.. చూసే ప్రేక్షకులను కూడా అంతే ఎనర్జిటిక్ గా చేస్తాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే జగడం లాంటి సినిమాతో సీరియస్ పాత్రలో నటించి మెప్పించాడు.జగడం సినిమాలో ఎలా సీరియస్ గా నటిస్తాడో.. రెడీ సినిమాలో అంత నవ్విస్తాడు.

విజయ్ దేవరకొండ

 

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో మంచి ప్రేక్షకాదరణ పొందాడు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఇక గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెట్ హీరో అయిపోయాడు. ఇంత తక్కువ కాలంలో ఇంత క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమా డిఫరెంట్ గానే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో సీరియస్ గా..సిన్సియర్ లవర్ గా ఎంత బాగా నటించాడో..గీత గోవిందం సినిమాలో తన సెటిల్ట్ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. కేవలం అర్జున్ రెడ్డి పాత్రలకు మాత్రమే సూటవుతాడన్న కామెంట్లు వచ్చినా…వాటికి గీత గోవిందం సినిమాతో సమాధానం చెప్పాడు. తాను సీరియస్ రోల్స్ ఎలా చేయగలడో… కామెడీ కూడా అలానే పండించగలనని చెప్పాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here