హుషారు తెలుగు మూవీ రివ్యూ

#HushaaruReview,Hushaaru Movie Live Updates,Hushaaru Movie Plus Points,Hushaaru Movie Public Response,Hushaaru Movie Public Talk,Hushaaru Movie Review,Hushaaru Movie Review and Rating,Hushaaru Movie Story,Hushaaru Review,Hushaaru Telugu Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies 2018,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema Latest News
Hushaaru Telugu Movie Review

నూతన దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో కొత్త నటీ నటులతో తెరకెక్కిన సినిమా హుషారు. లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో కాస్త బోల్డ్ కంటెంట్.. ఇప్పటి జనరేషన్ తగ్గట్టు తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే టీజర్లు, ట్రైలర్లతో అంచనాలు పెంచేసింది ఈ సినిమా. మరి ఆ అంచనాలను రీచ్ అయిందా..? ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : తేజ్ కూరపాటి , అభినవ్ మేడిశెట్టి , దినేష్ తేజ్, తేజుస్ కంచెర్ల, ప్రియా వడ్లమాని, దక్ష నగార్కర్, హేమల్
దర్శకత్వం : శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాత : బెక్కం వేణుగోపాల్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
ఎడిటర్ : విజయ్ వర్ధన్

కథ :

చై (అభినవ్ మేడిశెట్టి), ధృవ్ (దినేష్ తేజ్), ఆర్య (తేజుస్ కంచెర్ల), బంటీ (తేజ్ కూరపాటి) నలుగురుక్లోజ్ ఫ్రెండ్స్ . చదువంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే చదువు కంటే ఎంజాయ్‌‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఆర్య తన స్కూల్ మేట్ (దక్ష నగార్కర్)తో ప్రేమలో పడుతాడు. పార్టీలో తొలిచూపులోనే ప్రేమించిన రియా (ప్రియా వడ్లమాని)కు చై దగ్గరవుతాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో చై కు క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆపరేషన్ కు బాగా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో చై ను బ్రతికించుకోవడం కోసం మిగిలిన ముగ్గురు ఏం చేశారు? చివరికి వారి జీవితాలు ఏమాయ్యాయి ? ఈ కథలో రాహుల్ రామకృష్ణ ( రాజు బొల్లం) పాత్ర ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు హర్ష సినిమాను తెరకెక్కించిన విధానం చూస్తుంటే.. నిజంగా కొత్త దర్శకుడని ఎక్కడా అనిపించడు. కథలో అనేక అంశాలు, పలు రకాల పాత్రలను కథలో బ్లెండ్ చేసిన తీరుకు అభినందించాల్సిందే. రాసుకున్న కథలో కొత్తదనం లేకున్నా దాన్ని యూత్ కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో చాలా వరకు విజయం సాధించాడు. సినిమాకు చై , ధృవ్ , ఆర్య , బంటీ పాత్రలు సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యాయి. ఆ పాత్రల్లో నటించిన వారు అందరు కొత్త వారైనా చాలా సహజంగా నటిస్తూ సినిమాకు హైలైట్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు కూడా బాగానే నటించారు. ముఖ్యంగా… ప్రియా వడ్లమాని బోల్డ్‌గా కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికా మోజులో ఉండే యువత ఎలా ఉంటుందో ఆ పాత్రలో ప్రియ ఒదిగిపోయింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్లు వారి వారి పాత్రల మేర బాగానే నటించారు. అలాగే రాహుల్ రామకృష్ణ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ గా నిలిచాడు. తన దైన కామెడీ టైమింగ్ తో సినిమాను నిలబెట్టేప్రయత్నం చేశాడు. రాహుల్ రామకృష్ణ ఫెర్ఫార్మెన్స్ తో సెకండాఫ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.

ఇక ఈ చిత్రానికి రాధన్ మ్యూజిక్ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా ‘ఉండిపోరాదే’ సాంగ్ చాలా కాలం గుర్తిండిపోతుంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట ప్రతి ఫ్రేమ్ ను చాలా చక్కగా చూపించాడు. సినిమా చూపిస్త మావ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ లాంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హుషారు సినిమాను రూపొందించారు. పక్కగా యూత్‌ను టార్గెట్ చేసే కథను చాలా ట్రెండీగా తెరకెక్కించారు.

ఫైనల్ గా చెప్పాలంటే ఫ్రెండ్‌షిప్, లవ్, ఫన్, ఎమోషనల్ లాంటి అంశాలతో మేలవించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ హుషారు. ఈ చిత్రం యూత్ కు అయితే నచ్చేస్తుంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడం కొంచెం కష్టమే.

 

 

హుషారు తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here