అనగనగా ఓ ప్రేమకథ తెలుగు మూవీ రివ్యూ

#AnaganagaOPremakathaReview, Anaganaga O Premakatha Movie Live Updates, Anaganaga O Premakatha Movie Plus Points, Anaganaga O Premakatha Movie Public Response, Anaganaga O Premakatha Movie Public Talk, Anaganaga O Premakatha Movie Review, Anaganaga O Premakatha Movie Review and Rating, Anaganaga O Premakatha Movie Story, Anaganaga O Premakatha Review, Anaganaga O Premakatha Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Anaganaga O Premakatha Telugu Movie Review

ప్రముఖ ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌. జే అశ్విన్‌ హీరోగా.. రిద్ది కుమార్ హీరోయిన్ గా అనగనగా ఓ ప్రేమకథ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రతాప్ తాతం శెట్టి నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో..?ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చిందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు తదితరులు
దర్శకత్వం : ప్రతాప్ తాతంశెట్టి
నిర్మాత : కె.ఎల్.ఎన్.రాజు
సంగీతం : కె.సి.అంజన్
సినిమాటోగ్రఫర్ : ఎదురొలు రాజు
ఎడిటర్ : మార్తాండ్.కె.వెంకటేష్

కథ:

సూర్య (విరాజ్‌ జె.అశ్విన్‌) వృత్తి రిత్యా ఆర్కిటెక్. అనన్య (రిద్దికుమార్‌) సూర్యకి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. అంతేకాదు.. తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ సూర్యని సిన్సియర్ గా లవ్ చేస్తుంటుంది. కానీ సూర్య మాత్రం పూజ( రాధా బంగారు)ని సిన్సియర్ గా ప్రేమిస్తాడు. పూజ మాత్రం సూర్యని మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లి పోతుంది. అలా బాధలో ఉన్న సూర్యకు..ఒకానొక సందర్భంలో అనన్య తనని ఎంతలా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు. ఆ క్రమంలో సూర్య కూడా అనన్యను ప్రేమిస్తాడు. ఇక తన ప్రేమను అనన్యకు చెబుదామని వెళ్లగా..అక్కడ అనన్య సూర్య ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంది. సూర్యను చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయి అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది..?సూర్య చివరకి అనన్య ప్రేమను సొంతం చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి విరాజ్ కు ఇది మొదటి సినిమానే అయినా..అలాంటి లోపం ఎక్కడా కనిపించలేదు. అమ్మాయిల వెంట తిరిగే కుర్రాడిలా… లవర్ వదిలేసినప్పుడు పడే బాధ.. హీరోయిన్ ప్రేమ తెలుసుకొని తాను ప్రేమించడం.. తన ప్రేమను తెలియజేసే సన్నివేశాల్లో తన పాత్రను చాలా చక్కగా మౌల్డ్ చేసుకున్నాడు. లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా కూడా చాలా ఫిట్ గా బాగున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన రిద్దికుమార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన రాధా బంగారు కూడా బాగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

దర్శకుడు బ్రెయిన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు.. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి.. వాటిని కూడా కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి ఉండే ఇంకా బావుండేది.

ఎదురొలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.
ఇక సంగీత దర్శకుడు కె.సి.అంజన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే ఇంటర్వెల్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

అనగనగా ఓ ప్రేమకథ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here